....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 11

వివక్ష భావన పోగొట్టాలి!
విద్యకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ చెప్పిందిదీ..

స్కూళ్లకు పంపించడం (ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు) విషయంలో గత కొన్ని దశాబ్దాలలో మంచి పురోగతి ఉంది. మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో.. ప్రత్యేకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో హైస్కూళ్లు, జూనియర్ కాలేజీలు పెరి గాయి. మూడు ప్రాంతాల్లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్, రంగారెడ్డి(జోన్ 6)లలో చదివించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే ఉన్నత, వృత్తి విద్యాసంస్థలలో అడ్మిషన్‌కు అర్హత సాధించేందుకు అవకాశముండడమే అందుకు కారణం.

తెలంగాణ లో ప్రాథమిక స్థాయిలో డ్రాపవుట్స్ ఇంకా ఎక్కువే. దీనిపై దృష్టి పెట్టాలి.

హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు సబ్జెక్టులలో పాస్ మార్కు లు వేర్వేరుగా ఉండడం తెలంగాణ విద్యార్థులు, విద్యావేత్తలు అసౌకర్యంగా భావిస్తున్నారు. దీనిని హేతుబద్ధీకరించాలి.

హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ ఉన్నత, వృత్తి విద్యా (ముఖ్యంగా ఇంజనీరింగ్) సంస్థలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్రైవేటు కాలేజీలున్నాయి. రాజధాని నగరం కావడం పెద్దసంఖ్యలో జాతీయ, రాష్ర్ట స్థాయి విద్యాసంస్థలు ఒకేచోట చేరడానికి కారణం. దీనివల్ల ఆదిలాబాద్ వంటి జిల్లాలు వెనకబడి ఉన్నాయి. అందుకని రాష్ర్టంలోని జిల్లాలు, ప్రాంతాలన్నిటికీ ఉన్నత, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలను విస్తరించాలి.

విద్యాసంస్థల కేంద్రీకరణ, గ్రాంట్లకు సంబంధించి కమిటీ ముందు తెలంగాణ గ్రూపులు లేవనెత్తిన అంశాల్లో కొన్ని సమంజసమైనవే. అయితే అన్నీ వారు చెప్పినంత తీవ్రంగా లేవు. తెలంగాణలో అక్షరాస్యత, స్కూళ్ల లభ్యత సంతృప్తికరంగానే ఉన్నాయి. నిధుల మంజూరు, విద్యాసంస్థల కేంద్రీకరణ వంటి వాటిని సరిచేయాల్సి ఉంది. ప్రభుత్వ వ్యయం ప్రాంతాలన్నిటికీ సమానంగా ఉండేలా చూడాలి. ఉత్తర తెలంగాణలో ఒక వైద్య కళాశాలను నెలకొల్పడం ద్వారా ఒక ముఖ్యమైన అసమతౌల్యాన్ని సరిచేయవచ్చని కమిటీ భావిస్తున్నది.

ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలకు సంబంధించి తెలంగాణకు రూ. 93 కోట్లు, కోస్తాంధ్రకు రూ. 224 కోట్లు, రాయలసీమకు రూ. 91 కోట్లు కేటాయించారు. తెలంగాణ జనాభాతో పోలిస్తే రాయల సీమ జనాభా సగం ఉండదు. అందుకని తెలంగాణ ప్రాంతానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.

టెక్నికల్, ప్రొఫెషనల్ విద్యకు ఆంధ్రప్రదేశ్ యువత ప్రాధాన్యత నిస్తున్నది. ఇలా అర్హత సాధిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ప్రైవేటు కాలేజీలు (ముఖ్యంగా ఇంజనీరింగ్) నాణ్యమైన విద్య అందించకపోవడంతో తక్కువ వేతనాలకే ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. ఇలాంటి గందరగోళంలో ఉన్న యువతను ‘‘తెలంగాణ ప్రజలపట్ల వివక్ష కారణంగానే మంచి ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతున్నాం’’ అంటూ నేతలు తమకనుకూలంగా విని యోగించుకుంటున్నారు. ఇది ప్రాంతాలు, జాతులమధ్య కోపతాపాలకు కారణమౌతున్నది.

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంపై రాష్ర్టప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్ని ప్రాంతాల్లోనూ.. ముఖ్యంగా హైదరాబాద్ వెలుపల తెలంగాణ ప్రాంతంలోనూ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్ని ప్రారంభించాలి.

తెలంగాణలో ఉన్నత విద్యార్హతలున్న అనేకమంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చినవారే. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయని వారు ఆశిస్తున్నారు. అలా జరగకపోవడంతో వారంతా అసంతృప్తికి గురవుతున్నారు. మంచి భవిష్యత్ ఉంటుందని వాగ్దానం చేసేవారిని సులువుగా నమ్ముతున్నారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో దళితులు, వెనకబడిన కులాలకు చెందిన విద్యార్థులు ఎక్కువసంఖ్యలో ఉండడం దీనికి నిదర్శనం. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలలో సాగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నవారిలో ఎక్కువమంది దళిత/బీసీ నేపథ్యం ఉన్నవారే. ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది దళిత, వెనుకబడిన కులాల విద్యార్థులేనని తెలుస్తున్నది. తగిన శిక్షణ లేకపోవడంవల్ల అరుదుగా దానికి వివక్ష తోడు కావడం వల్ల మంచి ఉపాధి అవకాశాలు లభించడం లేదని, తమ పట్ల వివక్ష పాటిస్తున్నారని, నిర్లక్ష్యం వహిస్తున్నారనే భావనలను తెలంగాణ విద్యార్థులలో పోగొట్టాలి. వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి అదే మార్గం. నాణ్యమైన విద్యనందించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి వి ఉద్యమాలపై విద్యార్థుల వైఖరిలో మార్పు తీసుకొస్తాయి.

1 comment:

  1. That is what we were arguing all these days? Why a Govt.Medical college and a Govt.Engg. college in each Dist. of Telangana were not started,in long long period of 54 years? Why the same colleges established by Nizams are utilized for children of settlers also, even today? What share of seats, original Telangana studenta are getting?
    Where as in Rayalaseema, in each Dist. there is a Govt.Medical college and a Govt Engg.college. This task is completed for themselves by the No.of CMs of Rayalaseema. Is it not
    DESCRIMINATION?

    ReplyDelete