....

Footer Right Content

Wednesday, January 5, 2011

శ్రీకృష్ణ కమిటీ 5 సూచనలు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలపై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ప్రధానంగా 5 సూచనలను తన నివేదికలో పొందుపర్చింది.
సూచన 1 : రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచి తెలంగాణ కోసం మూడు ప్రత్యేక బోర్డుల ఏర్పాటు. తెలంగాణ కోసం నీటిపారుదల, విద్య, సాధారణ అభివృద్ధికి ప్రత్యేక బోర్డులు
సూచన 2 : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విభజన (1956 ముందు పరిస్థితి పునరుద్ధరణ)
సూచన 3 : హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డిలతో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌
సూచన 4: తెలంగాణ, రాయలసీమ కలిపి ఒకటిగా, కోస్తాంధ్ర ప్రాంతం ఒకటిగా రాష్ట్ర విభజన.
సూచన 5 : రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించడం
--------------
మొదటి సంపుటిలో 9 అధ్యాయాలు
 1960 అక్టోబర్ 3వ తేదీన ఐరాసలో పండిత్ జవహర్ లాల్ నెహ్రు ప్రసంగించిన బుద్ధుని ప్రవచనాలతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ప్రారంభించింది. ఈ నివేదికలోని మొదటి సంపుటిలో 9 అధ్యాయాలతో కూడిన 505 పేజీలు ఉన్నాయి.

1వ అధ్యాయం : రాష్ట్రంలో పరిణామాలు, చారిత్రక దృక్పధం
2వ అధ్యాయం : ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి - సమతౌల్యత విశ్లేషణ
3వ అధ్యాయం : విద్య-వైద్యం
4వ అధ్యాయం : నీటి వనరులు, సాగునీటి అభివృద్ధి, విద్యుత్
5వ అధ్యాయం : ప్రజలు - ఉద్యోగిత అంశాలు
6వ అధ్యాయం : హైదరాబాద్ మహా నగరం
7వ అధ్యాయం : సామాజిక, సాంస్కృతిక అంశాలు
8వ అధ్యాయం : శాంతి భద్రతలు అంతర్గత సమస్య
9వ అధ్యాయం : భవిష్యత్‌పై సూచనలు
 

No comments:

Post a Comment