....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 10

శాంతిభద్రతలు.. అంతర్గత భద్రత

అధ్యాయం-8
కమిటీ తన విధుల్లో భాగంగా... తక్షణ శాంతిభద్రతల సమస్యలు, దీర్ఘకాలంలో మావోయిస్టుల కార్యకలాపాలతోపాటు అంతర్గత భద్రతకు సంబంధించి ఏర్పడనున్న చిక్కులను పరిశీలించింది. ఈ భయాందోళనలను ఆయా రాజకీయ పార్టీలు, వివిధ ఇతర గ్రూపులు కమిటీకి సమర్పించిన వినతిపత్రాల్లో వ్యక్తం చేశాయి. అలాగే కమిటీ రాష్టస్థ్రాయిలో విభిన్న భాగస్వాములతో జరిపిన సమావేశాలు, అదేవిధంగా గ్రామాలను సందర్శించినప్పుడు జరిపిన సంభాషణల సందర్భంగా కూడా ఇవి వ్యక్తమయ్యాయి.

మరోవైపు.. సభ్య కార్యదర్శి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం (17 జిల్లాల్లో)తో విడివిడిగా సంప్రదింపులు జరిపారు. ఇందుకు సంబంధించి ఇతర వనరుల నుంచి సమాచారాన్ని సేకరించాం. పైన పేర్కొన్న అంశాలన్నింటినీ కవర్ చేస్తూ ఒక నోట్ తయారు చేశాం. దీనిని ఈ నివేదికతోపాటు విడిగా ఒక కవరులో పెట్టి హోం మంత్రిత్వశాఖకు సమర్పిస్తున్నాం. నివేదికకు చెందిన తొమ్మిదో అధ్యాయం ‘ది వే ఫార్వర్డ్’ను రూపొందించడంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంది.

No comments:

Post a Comment