....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 12

ఆర్థికంగానూ ఆటంకమే...
ఆర్థిక కోణాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా దేశాలకు దేశాలే ఆర్థికంగా సమైక్యమవుతున్నాయి. ఆర్థికావకాశాలను, మార్కెట్లను, ఉద్యోగావకాశాలను పెంచుకునేందుకు ఆర్థిక బ్లాకులుగా ఏర్పడుతున్నాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంతర్రాష్ట్ర, దేశీయ వర్తకానికి, సరుకులు, సేవల రవాణాకు అడ్డంకిగా మారుతుందన్నది సాధారణంగా ఉండే అభిప్రాయం. ఉదాహరణకు రకరకాల స్థానిక పన్నులు, సెస్‌ల వంటివి స్వేచ్ఛా వాణిజ్యానికి అడ్డంకిగా మారుతాయి. ఖర్చులను పెంచుతాయి. పైగా ప్రాంతీయంగా, రాష్ట్రాల మధ్య వస్తువులు, సేవల రవాణాను నిరోధించేలా స్థానిక చట్టాలుండే ఆస్కారముంది.

ఇలాంటి భయాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే హైదరాబాద్ వంటి మార్కెట్, సరఫరాల కేంద్రం తమకు అందుబాటులో లేకుండా పోతుందని వారు సందేహిస్తున్నారు. పైగా భారీ జనాభా, వ్యాపారం, మార్కెట్ సాంద్రతతో కూడిన హైదరాబాద్ వంటి అతి పెద్ద మార్కెట్‌ను కోస్తాంధ్ర కోల్పోతుంది. ఈ దృష్ట్యా చూస్తే కొత్తగా ఏర్పడే రాష్ట్రాల (తెలంగాణ, కోస్తాంధ్ర) ఆర్థిక వృద్ధిని నిరోధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన కేవలం ప్రతికూల చర్య మాత్రమే కాగలదు. ఆర్థికంగా చూసినా భూ సరిహద్దులతో కూడిన తెలంగాణ ప్రాంతం విశాఖపట్నం తదితర భారీ నౌకాశ్రయాలున్న తూర్పు తీరంతో సంబంధాన్ని, తద్వారా పలు అవకాశాలను పోగొట్టుకుంటుంది.

దేశవ్యాప్తంగానూ సవుస్యే...

రాష్ట్ర విభజన దేశవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. పలుచోట్ల చిన్న రాష్ట్రాల కోసం ఆందోళనలు ఉధృతమవుతాయి. అంతేగాక భాషా ప్రాతిపదికన ఏర్పాటైన ఒక రాష్ట్రాన్ని రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ అనంతరం తొలిసారిగా విడదీసినట్టవుతుంది. అందుకే దీని పరిణామాలను అత్యంత ప్రశాంతంగా, రాగద్వేషాలకు అతీతంగా పరిశీలించాల్సి ఉంటుంది.

ఇవ్వకపోయినా సమస్యే...

సుదీర్ఘమైన ప్రత్యేక తెలంగాణ డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం నెలకొన్న తీవ్ర భావోద్వేగాలు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వని పక్షంలో ఇలాగే కొనసాగే అవకాశముంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పెద్ద మనుషుల ఒప్పందంలోని కొన్ని కీలకాంశాలను అమలు చేయకపోవడం, జల, సాగునీటి పథకా అమలులో కొంతమేరకు జరిగిన నిర్లక్ష్యం, మౌలిక విద్యా సదుపాయాల కల్పనకు సరిగా జరగని ఏర్పాట్లు (హైదరాబాద్‌ను మినహాయించి), ప్రభుత్వోద్యోగాల్లో రాష్టప్రతి ఉత్తర్వుల అమలులో జరిగిన అనవసర జాప్యం తెలంగాణ ప్రజల్లో మనోవేదనకు, భావోద్వేగాలకు దారితీశాయి.

తమపై ఆధిపత్యం, వివక్ష సాగుతున్నాయన్న భావన కలిగించాయి. అందుకే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ పూర్తిగా అన్యాయమైనదేమీ కాదు. అందులో కాస్త పస ఉంది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనుకుంటే హైదరాబాద్‌లో, తెలంగాణ జిల్లాల్లో స్థిరపడ్డ కోస్తాంధ్ర, రాయలసీమ వాసుల్లో తమ ఆస్తులు, పెట్టుబడులు, జీవనోపాధి, ఉపాధి వంటివాటిపై నెలకొనే సందేహాలను సముచిత రీతిలో నివృత్తి చేయాల్సి ఉంటుంది. వారి భద్రత, రక్షణలకు కొత్త రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్న నమ్మకం కూడా కలిగించాల్సి ఉంటుంది. కాబట్టి...

కమిటీ వ్యాఖ్య: మంచిచెడులన్నింటినీ బేరీజు వేశాక, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు అత్యంత అభిలషణీయమైన పరిష్కారం మాత్రం కాదని, రెండో అత్యుత్తమ పరిష్కారం కాగలదని కమిటీ భావిస్తోంది. ఇక తప్పదని భావిస్తే, అనివార్య పరిస్థితుల్లోనే రాష్ట్రాన్ని విభజించాలని ప్రతిపాదిస్తున్నాం. అది కూడా మూడు ప్రాంతాల ప్రజలూ సామరస్యపూర్వకంగా నిర్ణయం తీసుకుంటేనే..

2 comments:

  1. పెద్ద మనుషుల ఒప్పందంలోని కొన్ని కీలకాంశాలను అమలు చేయకపోవడం, జల, సాగునీటి పథకా అమలులో కొంతమేరకు జరిగిన నిర్లక్ష్యం, మౌలిక విద్యా సదుపాయాల కల్పనకు సరిగా జరగని ఏర్పాట్లు (హైదరాబాద్‌ను మినహాయించి), ప్రభుత్వోద్యోగాల్లో రాష్టప్రతి ఉత్తర్వుల అమలులో జరిగిన అనవసర జాప్యం తెలంగాణ ప్రజల్లో మనోవేదనకు, భావోద్వేగాలకు దారితీశాయి.
    The committee members have diluted the points in expressing in words, but poor chaps .. could not avoid expressing the genuine basic reasons behind Telangana Movement. Is not enough to prove that there was Descrimination and what little improvement in the situation,
    the committee is observing, is also after how much fight? Is this the fate of Telangana people expected, through out the life to beg or fight, by being in so called United State?

    ReplyDelete
  2. It is obvious that you didn't read the report. He observed there was rapid development in all sectors across entire Telangana since 1980, when nobody begging, fighting, pleading. It only stopped when we resorted to begging, pleading again on perceptions and myths(that somebody descriminated, deceived, exploited us..). Truth is always bitter and inconvenient.

    Telugu tejam gaaru,

    you are doing an excellent job of translating it in beautiful telugu. regards.

    ReplyDelete