....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 1

ఆఖరుదే అత్యుత్తమం...
6 ప్రతిపాదనలు చేసిన శ్రీకృష్ణ కమిటీ

శ్రీకృష్ణ కమిటీలో మొత్తం 9 అధ్యాయాలు... అవి..

1. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. చరిత్ర ప్రస్తావన.
2. ప్రాంతీయ, ఆర్థిక అంశాలు. సమతుల్యత విశ్లేషణ
3. విద్య, వైద్యం 4. నీటి వనరులు, ప్రాజెక్టులు
5. ప్రజలు, ప్రభుత్వ రంగ ఉపాధి 6. హైదరాబాద్ సంబంధ అంశాలు
7. సామాజిక, సాంస్కృతిక అంశాలు
8. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, నక్సల్స్ సమస్యలు
9. భవిష్యత్తు సూచనలు


‘‘ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయటం... రాష్ట్రాన్ని యుథాతథంగా సమైక్యంగా కొనసాగించటం.. ఈ రెండు డిమాండ్ల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితి అధ్యయనానికే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటయింది’’ అంటూ ఆరంభించిన తొమ్మిదవ అధ్యాయుంలోనే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన ప్రతిపాదనలన్నింటినీ గుదిగుచ్చింది. ఇదే అధ్యాయుంలో ప్రతిపాదనల కన్నా ముందు... తొలి ఎస్సార్సీ (రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్), భాషా ప్రయక్త రాష్ట్రాల ఏర్పాటు, దానికన్నా ముందు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటులో చేసిన ప్రసంగం... తెలంగాణపై వివిధ జాతీయు పార్టీల వైఖరి, తాజాగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్‌లలోని పరిస్థితులను అన్నిటినీ ప్రస్తావిస్తూ వచ్చింది. ప్రతి అంశంలోనూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉండాల్సిన పరిస్థితులు... ఏర్పడితే తలెత్తే పరిణామాలను వివరించే ప్రయత్నం చేసింది. 11 నెలల సుదీర్ఘ అధ్యయనం అనంతరం కమిటీ చేసిన ఆరు కీలక ప్రతిపాదనలు, వాటివల్ల తలెత్తే పరిణామాలపై కమిటీ వేసిన అంచనాలు ఇవిగో...

1. యథాతథ స్థితిని కొనసాగించటం


ఈ తొలి ప్రతిపాదనను పూర్తిగా శాంతిభద్రతలు, ప్రజాభద్రత కోణంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేసిన పక్షంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గత 54 ఏళ్ల చరిత్రను అనుసరిస్తూ ఇలాంటి ప్రతిపాదనపై కసరత్తు చేయెుచ్చు. ఎందుకంటే గతంలో తెలంగాణ అంశం ఎన్నడు తలెత్తినా ఆయా గ్రూపులకు ప్రభుత్వంలోనో... పార్టీలోనో తగిన స్థానం కల్పిస్తూ దాన్ని రాజకీయుంగానే ఎదుర్కొంటూ వచ్చారు. మరోవంక ‘తెలుగు ఆత్మగౌరవ’మన్న భావోద్వేగ పూరిత విన్నపాన్ని తెరపైకి తెచ్చి వేర్పాటువాద సెంటిమెంట్లను నిలుపు చేయగలిగారు. అయితే దీనివల్ల తెలంగాణ డిమాండ్ కాస్త మరుగునపడేది తప్ప పూర్తిగా సమసిపోలేదు.

కారణాలైతే పాతవే కానీ... 2000వ సంవత్సరం తరవాత మళ్లీ ఈ డిమాండ్ ఊపందుకుంది. పెద్ద మనుషుల ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయకపోవటం, ఉద్యోగులకు సంబంధించి 1975 నాటి రాష్టప్రతి ఉత్తర్వులను సంపూర్ణంగా అమలు చేయుకపోవటం, ప్రాంతీయుంగా విద్యా ప్రమాణాల్లో ఉన్న తేడాలు, తాగు-సాగునీటి వనరుల్లో సముచిత వాటానివ్వకపోవటంతో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధిని నిర్లక్ష్యం చేశారంటూ ప్రత్యేక డిమాండ్ జోరందుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకావాలన్న చిరకాల ఆకాంక్ష, భావోద్వేగాలు, సెంటిమెంటు వంటివి దీనికి తోడయ్యూయి. సమగ్ర ఆర్థిక వృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినట్లు మాకమిటీకి తగినన్ని ఆధారాలైతే ఏవీ కనిపించలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య, తాగు- సాగునీరు వంటి అంశాల్లో వారి వేదనలైతే కొనసాగుతున్నాయి. వీటిని మా నివేదిక వివిధ అధ్యాయూల్లో ప్రస్తావించాం కూడా.

ఏం జరగవచ్చునంటే...
నిజం చెప్పాలంటే ఏ చర్యలూ తీసుకోకుండా యథాతథంగా పరిస్థితిని కొనసాగించటం వల్ల తెలంగాణ ప్రజల భావోద్వేగాల్ని సంతృప్తిపరచలేం. అదే జరిగితే ఈ ప్రాంతంలో హింసాత్మక ఆందోళనల రూపంలో ఘర్షణలు చోటు చేసుకునే అవకాశమూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇవి దీర్ఘకాలం కొనసాగొచ్చు కూడా. గద్దర్‌కు చెందిన తెలంగాణ ప్రజాఫ్రంట్ మరోసారి టీఆర్‌ఎస్‌తో చేతులు కలుపుతుందని, వారి ఆందోళనలు తీవ్ర భావోద్వేగపూరితంగా, ప్రమాదకరంగా ఉంటాయునే సంకేతాలున్నాయి. వీటి ప్రభావం హైదరాబాద్, దాని చుట్టుపక్కలి జనజీవనంపై తక్షణం కనిపిస్తుంది. నగర ప్రతిష్టపై వీటి ప్రభావం పడి దాని ఆర్థిక వృద్ధి వురోసారి ప్రశ్నార్థకమవుతుంది.

గతంలోలా ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వంటి ప్రజాప్రతినిధులపై రాజీనామాల కోసం ఒత్తిళ్లు పెరుగుతాయి. అది అంతిమంగా రాజకీయు అనిశ్చితికి దారితీయెుచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం కూడా కొత్త ఊపును సంతరించుకోవచ్చు. ఇంతటి సంక్లిష్టత కారణంగా ప్రస్తుత పరిస్థితిని యుథాతథంగా కొనసాగించటం ఏమాత్రం ఆచరణీయుం కాదన్నది కమిటీ ఏకాభిప్రాయుం. ఏదో ఒక తరహాలో జోక్యం తప్పనిసరి. అందుకని దీన్నీ ఒక పరిష్కార మార్గంగా భావించినప్పటికీ దీనికి అన్నిటికన్నా అత్యల్ప ప్రాధాన్యమిస్తున్నాం.


2. కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి... రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం. రెండు రాష్ట్రాలూ తమతమ రాజధానుల్ని అభివృద్ధి చేసుకోవటానికి కొంత సమయమివ్వటం.
ప్రాంతీయు, జాతీయు, అంతర్జాతీయు స్థాయిల్లో హైదరాబాద్‌కు చారిత్రకంగా, ఆర్థికంగా ఉన్న ప్రాధాన్యాన్ని ఈ సూచన చెప్పకనే చెబుతుంది. ఐటీ, ఐటీఈఎస్ హబ్‌గా అంతర్జాతీయు ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్‌కో ప్రత్యేక స్థానముంది. అందుకని హైదరాబాద్‌ను వృద్ధికి చోదకశక్తిగా గుర్తిస్తున్నారిపుడు. దీంతో పాటు వేగంగా పురోగమిస్తున్న ఇక్కడి రియుల్ ఎస్టేట్ రంగంలో జాతీయు, ప్రాంతీయు సంస్థల పెట్టుబడులున్నాయి. పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉత్పాదకత బేస్ ఉండటంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి భారీ పెట్టుబడులొచ్చాయి.

పెద్ద సంఖ్యలో ప్రభుత్వరంగ సంస్థలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్లు, పౌర-మిలటరీ సంస్థలు, డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్లు హైదరాబాద్ ఇంటాబయటా కొలువుదీరాయి. ఏళ్లకొద్దీ వస్తున్న వలసదారులతో జనాభా లెక్కలే మారిపోయూయిక్కడ. గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియున్లో 3వ వంతు మంది ఇతర ప్రాంతాల వారే. ఆర్థిక వృద్ధి కొనసాగితేనే ఉద్యోగావకాశాలు సజీవంగా ఉంటాయి. అందుకని ఇతర ప్రాంతాలతో హైదరాబాద్‌కున్న బంధాల్ని అభివృద్ధి చేయుటం, కాపాడటం తక్షణావసరం. అప్పుడే వ్యాపారాలకు సుస్థిరమైన వాతావరణం ఉంటుంది.

ఇదిగో ఒక ఉదాహరణ...
హైదరాబాద్ పరిస్థితిని మెట్రోపాలిటన్ నగరాలైన బ్రస్సెల్స్, బెల్జియుంలతో పోల్చొచ్చు. 1968లో బ్రస్సెల్స్ నగరం ఎవరిదనే విషయుమై ఉత్తర ఫ్లామాండ్ రీజియున్లోని బెల్జియుంలో తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. అప్పుడు వారిముందున్న ఒకే ఒక మార్గం... రెండు సంస్కృతులు, మూడు ప్రాంతాలున్న బెల్జియుంను దేశంగా ప్రకటించటం. ఇక్కడ గుర్తించాల్సిందేంటంటే బెల్జియుంది కోటి జనాభా. దీన్లో ఉత్తర ప్రాంతంలోని 60 లక్షల వుంది ఫ్లెమిష్ మాట్లాడతారు. 40 లక్షల వుంది దక్షిణ బెల్జియుంలో ఫ్రెంచ్ మాట్లాడేవారు. కొద్ది మంది జర్మన్ మాట్లాడే మైనారిటీలూ ఉన్నారు. దీంతో ఫ్లెమిష్, ఫ్రెంచ్, జర్మన్ భాషల ఫెడరేషన్‌గా బెల్జియుం అవతరించింది. దీన్లో బ్రసెల్స్ క్యాపిటల్ ప్రాంతానికి రెండు భాషలతోపాటు స్వతంత్ర పరిధులు, పాలనాధికారాలున్నాయి.

ఇదీ... మా సూచన
ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి సంసృ్కతి ఉంది. తొలి భాషా ప్రయక్త రాష్ర్టం కూడా. మా ఉద్దేశం ప్రకారం... ఒక నగరం కోసం రెండు బలమైన వర్గాల పోటీ ఉన్నపుడు అక్కడ కేంద్రపాలిత ప్రాంత విధానమే మంచిది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విడదీయూల్సి వస్తే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయూలనేది ఈ అభిమతం ఉద్దేశం. రెండు రాష్ట్రాలూ సొంత రాజధానుల్ని అభివృద్ధి చేసుకునేదాకా ఇది ఉమ్మడి రాజధానిగానూ కొనసాగుతుంది. ప్రతిపాదిత కేంద్ర పాలిత ప్రాంతం ద్వారా వచ్చే రాబడి కేంద్ర ప్రభుత్వానికి వెళ్లినా... గ్రాంట్లు తగిన నిష్పత్తిలో మూడు ప్రాంతాలకూ అందేట్లు పరస్పర అంగీకార ఫార్ములాను అవులు చేయాలి.

ఏం జరగవచ్చునంటే...
కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, హైదరాబాద్ ఇప్పట్లానే రాజధానిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. కానీ తవు ఆర్థిక ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయి కనక వారికి ఈ మార్గం కూడా అనుకూలంగా అనిపించవచ్చు. అయితే హైదరాబాద్ తెలంగాణలోనే ఉండాలన్న తవు డిమాండ్ నెరవేరకపోతే తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ మనుగడ సాగించటం కష్టం కావచ్చు.

దీంతో పాటు భౌగోళికంగానూ కోస్తాంధ్ర వారికి నల్గొండ వల్ల, రాయలసీమ వారికి మహబూబ్‌నగర్ వల్ల ఈ ప్రాంతంతో అనుసంధానం ఉండదు. ఈ పరిస్థితి వల్ల తరచు ఆందోళనకారులు రోడ్లు బ్లాక్ చేయటం, నీటి సరఫరాను నిలిపేయుటం వంటివి చేయెుచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది... హైదరాబాద్ లేని తెలంగాణతో అక్కడి ప్రజలు సంతృప్తి చెందలేరు. హైదరాబాద్ తెలంగాణతో లేకుంటే వారి ఆకాంక్షలు నెరవేరనట్టే. దీంతో ఆందోళనలు కొనసాగుతాయి... మా అంచనా ప్రకారం... తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఘర్షణలు రేగుతాయి. మొదటి పరిష్కార మార్గంలో పేర్కొన్న తరహాలోనే సమస్యలు తలెత్తుతాయి. అందుకని ఈ మార్గం కూడా ఆచరణ సాధ్యం కాదనే కమిటీ భావిస్తోంది.

3. రాయల తెలంగాణ

రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలుగా విభజించటం. హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో అంతర్భాగంగా ఉంచటం.

ఎ) రాయలసీమలోని కొన్ని వర్గాల ప్రజలు దీన్ని వారి రెండో అభిమతంగా మా ముదుంచారు. వారి తొలి ప్రాధాన్యం వూత్రం సమైక్యాంధ్రమే. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చెప్పుకోదగ్గ ప్రాబల్యం ఉన్న ఆలిండియూ మజ్లిస్ పార్టీ కూడా... ముస్లిం మైనారిటీల ఆర్థిక, సంక్షేమ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రం సమైక్యంగానే కొనసాగాలని, ఒకవేళ విభజన అనివార్యమైన పక్షంలో తెలంగాణ- రాయలసీమ ప్రాంతాల్ని ఉవ్ముడి రాష్ట్రంగా ప్రకటించాలని కోరింది. వారి వాదనంతా జనాభా ప్రాతిపదికన సాగింది. తెలంగాణలో హైదరాబాద్‌ను మినహాయిస్తే 8 శాతం ముస్లింలున్నారని, రాయలసీమలో వారి సంఖ్య 12 శాతమని... ఈ రెండు ప్రాంతాలూ ఉవ్ముడిగా ఉంటేనే ముస్లింలకు తగిన రాజకీయు ప్రాధాన్యం కూడా ఉంటుందని ఆ పార్టీ పేర్కొంటోంది. కొందరు ఆర్థికవేత్తల విశ్లేషణ ప్రకారం చూసినా... రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అత్యంత వెనకబడింది రాయులసీమే. సాగు- తాగు నీటి అవసరాల కోసం తెలంగాణపైన, ఉద్యోగాలు-చదువుల కోసం హైదరాబాద్‌పైన అది ఎక్కువగా ఆధారపడింది. రెండు ప్రాంతాల్లోనూ సామాజిక వర్గాల మధ్య భారీ సారూప్యమూ ఉంది. ఈ ప్రాంతం వారికి కోస్తాంధ్రలో ఉంటారా? తెలంగాణలోనా? అనే చాయిస్ ఇస్తే తెలంగాణనే ఎంచుకుంటారు. మా ఉద్దేశం ప్రకారం ఆర్థిక, సామాజిక అంశాల పరంగా చూస్తే ఇది సరైన మార్గమే.

బి)ఈ ప్రతిపాదనను మిగతా వాటితో పాటే మాటల్లో మాటగా తెలంగాణలోని రాజకీయ పార్టీలు, గ్రూపుల ముందుంచాం. ఓల్డ్ సిటీలోని వారు మినహా తెలంగాణలోని ఏ ఒక్కరూ దీనికి సవ్ముతించలేదు. సరికదా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే తమ ప్రాంతానికి దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోవటానికి రాయలసీవు రాజకీయు నాయకులే కారణవుని, తవు భూ వనరులను వారే దోచుకుంటున్నారని ఆ తెలంగాణ గ్రూపులు భావిస్తున్నారుు.

ఏం జరగవచ్చునంటే...
క్లుప్తంగా చెప్పాలంటే... ఈ ప్రతిపాదనను అటు తెలంగాణ వాదులు, ఇటు సమైక్యాంధ్ర వాదులు ఎవ్వరూ సవ్ముతించే అవకాశం లేదు. పెపైచ్చు ఈ ప్రతిపాదన వల్ల వివిధ రాజకీయు పార్టీలు, గ్రూపుల్లోని ఛాందసవాద శక్తులు విజృంభించే అవకాశమూ ఉంది. ఇలాంటి సిఫారసు వల్ల తెలంగాణ ప్రాంతంలో ఆందోళనలను కూడా కొట్టి పారేయలేం. ఈ మార్గం ఆర్థికంగా అనుసరణీయమే అయినా... మూడు ప్రాంతాల ప్రజలకూ ఇది ఆమోదయోగ్య పరిష్కారమని కమిటీ భావించటం లేదు.

4. రెండు రాష్ట్రాలుగా విభజన, కేంద్రపాలిత ప్రాంతంగా గ్రేటర్ హైదరాబాద్

రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించాలి. గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా విస్తరించాలి. తద్వారా కోస్తాంధ్రలోని గుంటూరు జిల్లా, రాయలసీమలోని కర్నూలు జిల్లాలతో దానికి భౌగోళిక సంబంధముండేలా చూడాలి. అందుకోసం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని మండలాలను ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కలపాలి.

సానుకూలతలు: ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నానాటికీ వృద్ధి చెందుతోంది. నగర సరిహద్దులను ఇటీవలే బాగా విస్తరించారు. ఎంసీహెచ్ హయాంలో 175 చదరపు కిలోమీటర్లున్న నగరం ఇపుడు జీహెచ్‌ఎంసీ పరిధిలో 625 కిలోమీటర్లలో విస్తరించింది. హుడా స్థానంలో వచ్చిన హెచ్‌ఎండీఏ పరిధి 7,073 చదరపు కిలోమీటర్లకు చేరింది. ఇది గోవా పరిధికి దాదాపు రెట్టింపు! దీన్ని 12,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించడం ద్వారా ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం చేయూలనేది ఈ ప్రతిపాదన. అది 67 మండలాలు, 1,330 గ్రామాలతో కూడుకుని 12,430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది.

రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధిలో హైదరాబాద్ నగరం కీలకమని కమిటీ భావిస్తోంది. రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ రంగానికిది ఆయువుపట్టు. దేశ ఐటీ ఎగుమతుల్లో దీని వాటా 15 శాతం! పైగా మిగతా రాష్ట్రంతో హైదరాబాద్‌కు సామాజిక బంధాలున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వలసలు ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచే ఉండేవి. కానీ కొన్నేళ్లుగా తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా వలసలు పెరిగాయి. ఈ ధోరణి, జాతీయ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన ముంబై వృద్ధిని తలపిస్తోంది. వ్యూహాత్మకంగా కూడా హైదరాబాద్ దేశానికి చాలా ముఖ్యమైన నగరం. వ్యూహాత్మక ప్రాధాన్యమున్న జాతీయు సంస్థలు ఇక్కడున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆ సంస్థలు జాతీయ భద్రత కోణం నుంచి కూడా కీలకమైనవి.

పై అంశాల దృష్ట్యా హైదరాబాద్‌ను విస్తరించిన కేంద్రపాలిత ప్రాంతంగా చేయడాన్ని ఒక మార్గంగా సూచిస్తున్నాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలతోనూ భౌగోళిక సంబంధముండటం ఈ ప్రతిపాదనలోని కీలకాంశం. ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూనే చండీగఢ్ మాదిరిగా తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలు రెండింటి రాజధానులకూ హైదరాబాద్ ఆశ్రయం కల్పిస్తుంది. నగరానికి కావాల్సిన పాలన, పోలీసు వంటి అధికార యంత్రాంగాన్ని చాలావరకు రెండు రాష్ట్రాల క్యాడర్ల నుంచి తీసుకోవచ్చు. ఇక మౌలిక వసతుల వృద్ధికి అపారమైన అవకాశముంటుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం భౌగోళికంగా చాలా విసృ్తతమైనది, జనాభా పరంగా కోటికి మించి ఉండేది కాబట్టి చండీగఢ్-ఢిల్లీల మిశ్రమ పాలనా పద్ధతిని అనుసరించవచ్చు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌కు సొంత అసెంబ్లీని కూడా ఏర్పాటు చేయవచ్చు.

చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేశాక దాని పరిసరాల్లో ఉన్న మొహాలీ, డేరాబసీ, పంచ్‌కుల, పర్వానూ వంటి హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు చెందిన నగరాలు అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. ఢిల్లీ కారణంగా దాని పరిసరాల్లోని గుర్గావ్, సోనేపట్, ఫరీదాబాద్ (హర్యానా), ఘజియాబాద్, నోయిడా (యూపీ) కూడా ప్రగతి పథంలో దూసుకెళ్లాయి. అదేమాదిరిగా తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా హైదరాబాద్ దన్నుతో చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రగతి, ఉపాధిని సాధిస్తాయి. కాబట్టి బహుశా ఈ మార్గాన్ని మూడు ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగా మార్చవచ్చు. పైగా ప్రత్యేక తెలంగాణ ఇస్తే మున్ముందు ప్రత్యేక రాయలసీమ కోసమూ డిమాండ్ ఉధృతమయ్యే అవకాశముంది. రాయలసీమనూ రాష్ట్రంగా చేస్తే దానిక్కూడా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేయవచ్చు. ఇక కేంద్రపాలిత ప్రాంతం ఆదాయం నేరుగా కేంద్ర ఖజానాకు వెళ్తుంది గనుక కేంద్రం కొత్త రాష్ట్రాలతో (కోస్తాంధ్ర, తెలంగాణ) సంప్రతించి, ఆ మొత్తం నుంచి వాటికివ్వాల్సిన గ్రాంట్ల వాటాను తేల్చవచ్చు.

ప్రతికూలతలు: తెలంగాణవాదులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అందుకు రెండు కారణాలున్నాయి. 1) హైదరాబాద్‌ను వారు తెలంగాణలో అంతర్భాగంగా భావిస్తూ వస్తున్నారు. దాంతో ఉమ్మడి రాజధాని చేస్తే వారు అసంతృప్తి చెందుతారు. 2). నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కొన్ని మండలాలను హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంలో కలపడంపై కూడా నిరసన, వ్యతిరేకత వ్యక్తమవుతాయి. వీటికి తోడు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావడాన్ని అన్ని ప్రాంతాల వారూ వ్యతిరేకించవచ్చు.

కమిటీ సిఫార్సు: ఈ ప్రతిపాదనలో కొన్ని సానుకూలతలున్నా, అందరూ ఆమోదించేలా దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం కష్టం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత, భారీ నిరసనలు వ్యక్తంకావచ్చు. పైగా హైదరాబాద్‌తో గానీ, అది లేకుండా గానీ ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు పెచ్చరిల్లే ప్రమాదముందన్న అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ అంశాన్ని 8వ అధ్యాయం ‘శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, నక్సలిజం’లో వివరంగా చర్చించాం. (ఈ అధ్యాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. ప్రత్యేకంగా సీల్డ్ కవర్‌లో ఉంచి నేరుగా కేంద్ర హోం మంత్రి చిదంబరానికి అందజేసినట్టు కమిటీ పేర్కొంది)

5. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ

రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల ప్రకారం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా విభజించాలి. తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచాలి. సీమాంధ్ర కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి.

సానుకూలతలు...
ఇది రాష్ట్రాన్ని స్పష్టంగా తెలంగాణ, సీమాంధ్రలుగా రెండు ముక్కలు చేసే మార్గం. సీమాంధ్ర కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలి. ఇది తెలంగాణలోని మెజారిటీ ప్రజల డిమాండ్‌ను ఆమోదించడమే. వారి భావోద్వేగాలను, సెంటిమెంట్లను, తమపట్ల నిర్లక్ష్యం, వివక్ష జరిగాయనే భావనలను ఉపశమింపజేయడమే. అయితే సీమాంధ్ర రాష్ట్ర కొత్త రాజధానికి భారీ పెట్టుబడులు అవసరవువుతాయి. దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలి. తెలంగాణలో మెజారిటీ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తున్నట్టు ఆ ప్రాంతంలో కమిటీ జరిపిన విసృ్తత పర్యటనల్లో తేలింది. చెప్పుకోదగ్గ సంఖ్యలో తెలంగాణ వాసులు ఈ విషయంలో తటస్థంగా ఉండగా, కొన్ని వర్గాలు విముఖంగా ఉన్నాయి. మా పరిశీలనలివీ...

వరంగల్, పశ్చిమ ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, దక్షిణ ఆదిలాబాద్, మెదక్‌లోని సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. ఇక విద్యార్థి (ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు), నిరుద్యోగ యువత, నాన్ గెజిటెడ్ ప్రభుత్వోద్యోగ వర్గాలు అతి తీవ్రంగా ప్రత్యేకవాదం విన్పిస్తున్నాయి.

హైదరాబాద్ స్థానికులు (మజ్లిస్‌లోని మెజారిటీ వర్గాలతో కలిపి), మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర, రాయలసీమలకు ఆనుకుని ఉన్న తెలంగాణ మండలాలు/గ్రామాలు; తెలంగాణ ప్రధాన భూభాగంలోని పలు సెటిలర్ల మండలాలు/గ్రామాలు (ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో), సీమాంధ్ర, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు వలస వచ్చినవారు ప్రత్యేక డిమాండ్ విషయంలో తటస్థంగా ఉన్నారు.

తెలంగాణ ఉత్తరాది ప్రాంతంలోని గిరిజనుల్లో మెజారిటీ, ముఖ్యంగా కొండ ప్రాంతాల గిరిజను లు ప్రత్యేక మన్యసీమను; ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రలోని గిరిజన బెల్టును కలుపుతూ ఏకీకృత పాలనా వ్యవస్థను కోరుతున్నారు.

తెలంగాణలోని ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు తమకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థికాభివృద్ధి, రిజర్వేషన్ ఫలాలు కావాలని కోరుతున్నారు.

ఏం జరగవచ్చునంటే...
హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కింది పరిణామాలకు దారి తీయవచ్చు..

1. గతానుభవాల దృష్ట్యా చూస్తే, ఈ నిర్ణయం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తీవ్ర, హింసాత్మక ఆందోళనలు తలెత్తుతాయి. అక్కడ తక్షణం ప్రతిస్పందన, హింసాకాండ మొదలవుతాయి. హైదరాబాద్, జల, సాగునీటి వనరుల పంపకాలు కీలకాంశాలుగా మారతాయి.

2. తక్షణం రాజీనామా చేసి, సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడాల్సిందిగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై అక్కడి ప్రజలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

3. కోస్తాంధ్ర నుంచి రాయలసీమను విడదీసి ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న ఉద్యమం కూడా ఊహించిన దాని కంటే ముందే మొదలయ్యే అవకాశముంది.

4. స్వతంత్ర, అర్ధ స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా సాగునీరు, జల వనరుల వంటి సమస్యలను పరిష్కరించినా, ఈ విషయంలో కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు సందేహాలు లేవనెత్తుతూనే ఉంటారు.

5. నక్సలిజం, మతోన్మాదం పెరిగి అంతర్గత భద్రతను ప్రభావితం చేసే ఆస్కారముంది.


6. తెలంగాణ అభివృద్ధికి ప్రాంతీయ మండలి..

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణ ప్రాంతానికి రాజకీయ సాధికారత, సామాజిక ఆర్థికాభివృద్ధికోసం తెలంగాణ ప్రాంతీయు మండలి ఏర్పాటు చేస్తూ రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించడం.
ఎ) అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాక.... కమిటీ అభిప్రాయుం ప్రకారం అభివృద్ధి అనేది మూడు ప్రాంతాల సంక్షేమానికి అత్యంత కీలకమైన, ప్రధానమైన అంశం. ఆర్థిక, రాజకీయు వికేంద్రీకరణ ద్వారా దీన్ని సాధించవచ్చు. మిగతా ఆచరణీయు మార్గాల్లో దేన్ని పరిగణనలోకి తీసుకున్నా రాజధానులు, అసెంబ్లీలు, మంత్రివర్గాలు, కోర్టులు, సంస్థలు, ప్రభుత్వ యుంత్రాంగాల డూప్లికేషన్ తప్పనిసరి. ఇది అనవసరవునేది వూ విశ్వాసం. ప్రస్తుతం మూడుప్రాంతాల ముందున్న సమస్యలకు విభజన పరిష్కార మార్గాం కాదు. సమైక్యంగా ఉండటమే మంచిది. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, తెలంగాణ ప్రాంతంలోని సామజికార్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాజ్యాంగబద్ధమైన/ శాసనబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాం. 1956లో చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటుచేసి, సరిపడే నిధులను కేటాయించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఆయూ అంశాలపై చట్టబద్ధమైన సంప్రదింపులను ప్రాంతీయు మండలి నిర్వహిస్తుంది. ఉదాహరణకు ప్రాంతీయు మండలి పరిధిలోని అంశాలపై ప్రభావం చూపేలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చట్టం చేసినప్పుడు దానిపై సూచనలు, వ్యాఖ్యలకోసం ప్రాంతీయమండలికి పంపుతుంది. అలాగే ప్రాంతీయ మండలి తన పరిధిలోని ఏదైనా సబ్జెక్ట్‌పై చట్టం చేయూలనుకున్నప్పుడు, దానిపై రాష్ట్ర శాసనసభలో చర్చిస్తారు. ప్రాంతీయ మండలికి, రాష్ట్ర ప్రభుత్వానికి/శాసనసభకు మధ్య ఎప్పుడైనా, ఏవైనా అభిప్రాయభేదాలు తలెత్తినపుడు... గవర్నర్ ఆధ్వర్యంలో అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. ఈ కమిటీలో ఇరు ప్రాంతాల సభ్యులు సమానంగా ఉండగా, గవర్నర్ ఓటు కీలకమవుతుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,, స్పీకర్, శాసనమండలి చైర్మన్, శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ ప్రాంతీయ మండలి చైర్మన్, రాజ్యాంగ నిబంధనలు, ప్రాంతీయ సమస్యలపై అవగాహన ఉన్న నిపుణుడు ఈ కమిటీలో సభ్యులుగా ఉండవచ్చు.

ప్రాంతీయమండలి పరిధిలోని అంశాలివి...

తెలంగాణ ప్రాంతంలో (గ్రేటర్ హైదరాబాద్‌ను మినహాయించి) ఆర్థికాభివృద్ధి, ప్రణాళికలు

జలవనరులు, నీటిపారుదల రంగం
{పాథమిక, సెకండరీ, వృత్తి విద్య, నైపుణ్యాల అభివృద్ధి
స్థానిక పాలన (గ్రేటర్ హైదరాబాద్‌ను మినహాయించి)
జిల్లా ఆస్పత్రుల స్థాయి వరకు ప్రజారోగ్యం (వైద్య కళాశాలలు, ప్రత్యేక ఆరోగ్య విభాగాలకు మినహాయింపు) వీటితోపాటు ప్రాంతీయ, సావూజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను కూడా ప్రాంతీయ మండలి ఏర్పాటు సమయుంలో లేదా అవసరమైనప్పుడు చేర్చుకోవచ్చు.

మండలి మార్గదర్శకాలివీ: ప్రాంతీయ మండలి చైర్మన్ శాసనసభ్యుడై ఉండాలి. అతనికి కేబినెట్ మంత్రి స్థాయి అధికారం ఉండాలి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ప్రణాళిక అమలు తీరును ఇది పర్యవేక్షిస్తుంది. దీనికి సంబంధించిన విభాగాలన్నీ మండలిపరిధిలో ఉంటాయి
. అదనపు చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో మండలికి ప్రత్యేకమైన సచివాలయుం ఉంటుంది. మండలి పరిధిలోకి వచ్చే విభాగాలు, పనిభారాన్ని బట్టి... సభ్యుల సంఖ్య ఉండాలి. మండలి సభ్యులు తప్పనిసరిగా ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీ అయి ఉండాలి. కొన్ని రంగాల నిపుణులను ఓటు హక్కులేని సభ్యులుగా మండలిలోకి తీసుకోవచ్చు.

అలాగే మండలి సెక్రటేరియట్‌లోని అధికారులు, ఉద్యోగుల సంఖ్య కూడా పనిభారాన్ని బట్టి ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు, వ్యయానికి జీఎఫ్‌ఆర్ వర్తిస్తుంది. ఉప ప్రణాళిక నిధులను ఎప్పుడైనా పునర్వినియోగం చేయాల్సివస్తే అదంతా ప్రాం తీయు మండలి సిఫార్సులతోనే జరగాలి. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి లేదా కీలక మంత్రిత్వ శాఖలను తెలంగాణ ప్రాంత నేతలకు కేటాయించడంలాంటి చర్యల ద్వారా ఈ ప్రాంత ప్రజల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయూల్సి ఉంది. ప్రతిపాదిత ప్రాంతీయ మండలికి రాజ్యాంగ భద్రత కల్పించడం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు.

ఇందుకే ఈ ప్రతిపాదన...
జాతీయ దృక్పథం, మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కమిటీ సమైక్యాంధ్రను ప్రతిపాదిస్తోంది. అందరి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే ఇదే సరైనదని మా నమ్మకం. దృఢమైన రాజకీయు, పరిపాలనా నిర్వహణ ద్వారా అత్యధిక శాతం ప్రజలను ఒప్పించడం ఆచరణ సాధ్యమే. వైద్య, పారిశ్రామిక, ఐటీ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ భవిష్యత్తుపై అనిశ్చితి ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఈ ప్రతిపాదనతో కొందరు రాజకీయ నాయకులు, కొన్ని సంఘాలు, గ్రూపులు, తెలంగాణ ప్రాంతంలోని అత్యధిక శాతం ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని కమిటీకి తెలుసు. తెలంగాణలోని కొన్ని వర్గాలు దీనికి అంగీకరించకపోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక సంక్షేమం, ఉత్తమపరిపాలన, సామజికార్థిక అభివృద్ధి, జాతీయు దృక్పథం దృష్ట్యా ఇదే అత్యుత్తమ మార్గమని కమిటీ భావిస్తోంది.

No comments:

Post a Comment