....

Footer Right Content

Tuesday, January 25, 2011

మన తెలుగు ‘పద్మా’లు


 దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావును ఈసారి పద్మవిభూషణ్ పురస్కారం వరించగా, క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. 2010 సంవత్సరానికిగాను ‘పద్మ’ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ‘పద్మ’పురస్కారాలకు 128మంది ఎంపిక కాగా, వారిలో  31మంది మహిళలున్నారు.
 మధుర గానామృతానికి చిరునామా అయిన ఎస్.పి. బాలసుబ్రమణ్యానికి పద్మ భూషణ్ లభించింది. అలనాడు వెండితెరపై ఏరువాకాసాగారో.. అన్న పాటకు అద్భుతంగా నృత్యం చేస్తూ నటించిన వహీదా రెహమాన్‌కు పద్మ భూషణ్ లభించింది. వీరితోపాటు బ్యాంకింగ్ రంగంలో తన సొంతముద్రను వేస్తున్న చందా కొచ్చర్‌కు, తెలుగు సినిమాలతో ప్రారంభించి, జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా ఎదిగిన టబూకు, దశాబ్దాల తరబడి యువతను ఉర్రూతలూగిస్తున్న ఉషా ఉతుప్‌లకు కూడా పద్మశ్రీ లభించింది.

కేంద్ర ప్రభుత్వం 2010 ఏడాదికిగాను 'పద్మ' అవార్డులను మంగళవారం ప్రకటించింది. ప్రముఖ సినీనటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, కపిల వాత్సాయణ్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పల్లె రామారావు, అజీం ప్రేమ్‌జీ, బ్రజేష్ మిశ్రా, మాంటెక్ ఆహ్లూవాలియా తదితరులు పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే 'పద్మభూషణ్' అవార్డుకు గాను ప్రముఖ సినీనటి వహీదారెహ్మన్, ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జీ.వీ.కె. రెడ్డి, డాక్టర్ కే. అంజిరెడ్డి, సంగీత దర్శకుడు ఖయ్యూం తదితరులు ఎంపికయ్యారు.

అలాగే 'పద్మశ్రీ' అవార్డులకు గానూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీవీఎస్ లక్ష్మణ్, షూటింగ్‌లో హైదరాబాదీ గగన్‌నారంగ్, చందా కొచ్చర్, ఇర్ఫాన్ ఖాన్. శశికపూర్, కాజోల్, ఉషాఉతుప్, వై.సి. దేవేశ్వర్, భారత రెజ్లర్ సుశీల్‌కుమార్. కష్ణాపూనియా తదితరులను ఎంపిక చేస్తూ కేంద్రం ప్రకటన చేసింది. కాగా లక్ష్మణ్ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడంతో ఆయన కుటుంబసభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డు దేశంలో నాలుగో అత్యున్నతస్థాయి అవార్డు . 

1 comment: