....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 2

అంత వీజీ కాదు!..అయినా..

శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఉపోద్ఘాతం...
అప్పజెప్పిన పని సులభమైనది కాదు.. ఇందుకోసం విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధన జరిపాం

‘‘ఎవరికీ పరాజయం లేకుండా అందరికీ సమానంగా విజయం సిద్ధించినప్పుడే అది నిజమైన విజయమవుతుందని బుద్ధుడు చెప్పాడు. ఈనాటి ప్రపంచంలోనూ అదే నిజమైన విజయం. మరే ఇతర మార్గమైనా వినాశనానికే దారితీస్తుంది’’

‘వివాదాలు-విభేదాలు’ అంశంపై 1960 అక్టోబర్ 3వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగం.

‘మా కమిటీకి అప్పజెప్పిన పని సులభమైనది కాదు. ఇందుకోసం భాగస్వాములందరితోనూ విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధన జరిపాం. ఇందులో భాగంగా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రక, రాజకీయు, ఆర్థిక, సాంఘిక, సాంస్క­ృతిక ప్రాధాన్యమున్న అంశాలపై రాజకీయు పార్టీలు, ఇతర వర్గాలతో కమిటీ చర్చలు జరిపింది. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలించడం... ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను తొలగించేందుకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కల్పించేందుకు కొన్ని పరి ష్కార మార్గాలను గుర్తించడం, కార్యాచరణ ప్రణాళిక సూచించడం... ఇతర సలహాలు, సూచనలు ఏవైనా గుర్తిస్తే వాటిని అందించడం... కమిటీ ముందుంచిన లక్ష్యం. ఈ సమస్యలపై కమిటీ అధ్యయనం ప్రారంభించాక, పరిశోధన విస్తృతి మరింత పెరిగింది.

ఇది ప్రాంతాలకు సంబంధించే కాకుండా జాతీయ స్థాయి చిక్కులు కూడా ఉన్నట్లు కమిటీ గుర్తించింది. నివేదిక సమర్పించడంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా అది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టవచ్చని, తీవ్ర పరిణామాలు ఉండవచ్చని కమిటీ గుర్తెరిగింది. అందుకే సకాలంలో నివేదిక సమర్పించడానికి కమిటీ అత్యంత ప్రాధాన్యమిచ్చింది. మా ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాం. మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగానే ఉండాలని కొందరు వాదించినా, ఇరుప్రాంతాల్లోని అత్యధిక సంఖ్యాక ప్రజలు సమైక్యంగా ఉండాలనే కోరుకున్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటు కొన్ని షరతులకు లోబడే జరిగింది. మిగతా రాష్ట్రంతోపాటుగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ‘పెద్ద వునుషుల ఒప్పందం’ కుదిరింది. అయితే అది సఫలీకృతం కాలేదు. 1960వ దశకం చివర్లో, 70వ దశకం ప్రారంభంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అసంతృప్తులు తీవ్రస్థాయికి చేరాయి. ఒక దశలో విడిపోవడానికి సంసిద్ధమయ్యూరు. ఆ పరిస్థితుల్లో ఉద్రిక్తతలను తగ్గించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతిపాదించిన ‘ఆరు సూత్రాల ఫార్ములా’ను ఇరుపక్షాలు అంగీకరించాయి. ఆ తర్వాత మూడు దశాబ్దాల కాలంలో రాష్ట్రం గుర్తించదగిన స్థాయిలో ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది. ఫలితంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రగతిశీల రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.

అయితే ఈ ప్రగతివల్లనే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర భావనలు ఊపిరిపోసుకున్నాయనే వాదనలున్నాయుని చెప్పవచ్చు. అసవూనతలు తగ్గినప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడాను పూరించేందుకు, రాజకీయాధికారంకోసం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఊపందుకున్నాయి. దీని ఫలితంగా వచ్చిన ఆందోళనలతో 2009 చివర్లో, 2010 ప్రారంభంలో రాష్ట్రంలో తీవ్ర శాంతి భద్రతల సమస్యలు ఏర్పడ్డాయి. అదే ఈ కమిటీ ఏర్పాటుకు దారితీసింది. కమిటీకి అప్పగించిన పనిని పూర్తిచేయడానికి అనుసరించిన పద్ధతులు, మార్గాలను ఈ విభాగంలో క్లుప్తంగా వివరించాం. ప్రాథమిక సమావేశాలు, వివిధ భాగస్వాములు, ప్రజలనుంచి అందిన నివేదనలను పరిశీలించిన తర్వాత ఏఏ అంశాలపై అధ్యయునం, పరిశోధన అవసరమో కమిటీ గుర్తించింది. అవి చారిత్రక నేపథ్యం, ప్రాంతీయు ఆర్థిక, వాటాల విశ్లేషణ, విద్య-ఆరోగ్యం, నీటి వనరులు, నీటిపారుదల, విద్యుత్తు రంగాలు, హైదరాబాద్ నగరానికి సంబంధించిన అంశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, సామాజిక, సాంస్కృతిక అంశాలు, అంతర్గత భద్రతాంశాలు. వీటికి సంబంధించిన కచ్చితమైన సమాచారం, గణాంకాలు సేకరించడానికి, విశ్లేషించడానికి కమిటీ అన్ని ప్రయుత్నాలు చేసింది. న్యాయు, రాజ్యాంగపరమైన అంశాలు, సమస్య పరిష్కారానికి వివిధ పరిష్కార మార్గాలను తొమ్మిదో అధ్యాయుం ‘‘ద వే ఫార్వర్డ్’లో పొందుపరిచాం.

అధ్యయనం ముగిసేసరికి ప్రత్యేక తెలంగాణకు, సమైక్య రాష్ట్రంగా ఉంచడానికి సకారణాలు కనిపించాయి. రాయులసీమ, మరికొన్ని ప్రాంతాల వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ వర్గాలు అందించిన సూచనలను కూడా సునిశితంగా పరిశీలించాం. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్నాక... తెలంగాణలో అసంతృప్తి కొనసాగడానికి కొన్ని కారణాలున్నప్పటికీ, విభజన డిమాండ్ పూర్తిగా అసంబద్ధమైనది కానప్పటికీ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంవైపే మొగ్గు ఉన్నట్లు కమిటీ గుర్తించింది’’

1 comment: