....

Footer Right Content

Saturday, August 13, 2011

తెలుగు తల్లికి వెలుగు నీరాజనం

నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభలు
విజయవాడ నగరంలో నేటి నుంచి మూడు రోజులు తెలుగు తల్లికి వెలుగు నీరాజనం! తెలుగు భాష, సాహిత్య, సంస్కృతి, పద్య, గద్య, వచన, కవిత, విమర్శ ప్రేమికులు తమ సాహితీ దాహార్తిని తీర్చుకునేందుకు ‘ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు’ వేటూరి సుందరరామమూర్తి కళా వేదికపై(తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం) నేడు అత్యంత శోభాయమానంగా ప్రారంభంకానున్నాయి. ఈ ప్రారంభ వేడుకలకు తెలుగు తల్లి పాదాలకు వెలుగు పారాణిని అద్దిన అతిరథ మహారథులు హాజరు కానుండడం విశేషం.

Thursday, August 11, 2011

తెలుగు అక్షరాలు తెలీకుండానే పట్టాలు అందుకుంటున్నారు : మండలి


వెల్లివిరియనున్న తెలుగు సౌరభం

రేపటి నుంచి విజయవాడలో  ప్రపంచ తెలుగు మహాసభలు
 
‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ.. మా కన్నతల్లికీ మంగళారతులు’ అంటూ తెలుగువారి చరిత్ర, సంస్కృతి, మనుగడ, స్థితిగతులపై దృష్టి సారిస్తూ కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో రెండో ప్రపంచ తెలుగు మహాసభలను ఈ నెల 13, 14, 15 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నారు. దేశ, విదేశాల్లోని సాహిత్య, భాష, పరిశోధన, సాంకేతిక నిపుణులకు ఈ సభలు సగర్వంగా స్వాగతం పలుకుతున్నాయి. తెలుగు వెలుగులను కనులకు కడుతూ మూణ్నాళ్లు జరిగే ఈ తెలుగు పండుగకు వేటూరి సుందరామమూర్తి ప్రాంగణం (తుమ్మలపల్లివారి కళాక్షేత్రం) వేదికైంది.