....

Footer Right Content

Saturday, August 21, 2010

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.

చేతి వృత్తుల చేతులిరిగిపాయె, నా పల్లెలోన
అయ్యొ గ్రామ స్వరజ్యం గంగలోనబాయె, ఈ దేశంలోన

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి

పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా

ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి
ఈత కల్లు బంగారమయ్యినది
మందుకలిపిన కల్లును తాగిన మంది కండ్లు నిండుసులయ్యినవి

చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
ఆ సాయిబు పోరలకు ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా?

అరకల పనికి ఆకలిదీరక గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటి, ఆ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి, సోడె లాగులు జాడకు లేవు
రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు
ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా.

కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెల నుంచీ

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

పూసలోల్ల తాలాము కప్పలు,
కాశిలో కలసి ఖతమౌతున్నవి.

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువు కుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండిగిల్లెగిరి పడ్డదో నా పల్లెల్లోనా.

వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ…
పంటపొలాల మందుల గత్తర వాసన

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై…
…బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనలు బైరాగుల
కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకను పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
బహుళ జాతి కంపని మాయల్లోనా నా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె నా అయ్యల్లారా.

- గోరటి వెంకన్న

7 comments:

  1. పాట చాలాభాగుంది. బూర్జువా వర్గానిది పైచెయి అయిన చొటల్లా అది సకల ప్యుడల్ సంభంధాలనూ సకల పిత్రుస్వామిక సభంధాలనూ సకల నిష్కపట గ్రామీన సభంధాలనూ నిర్మూలించింది . సమస్త ఉత్పత్తి సాధనాల సత్వరాభివ్రుద్దిద్వారానూ వార్త రవాణా సాధనాల అపారమైన అభివ్రుద్దిద్వారానూ బూర్జువావర్గం సకల జాతులనూ , అత్యంత అటవిక జాతులను సైతం నాగరికతలొకి లాగుతుంది .తాను ఉత్పత్తి చెసె సరుకుల చ్ కధరలు అనె భారీ ఫిరంగులతొ భూర్జువావర్గం ఎటువంటి కొటగొడనైనా పగలగొడుతుంది విదీశీయుల పట్ల ఎంటటి మహా మొండిద్వెషం గల ఆటవికులనైనా పాదాక్రాంతం చెసుకుంటుంది .దాని నిర్భందం వల్ల సకల జాతులూ మరణమె మార్గాంతరం గనుక, బూర్జువా ఉత్పత్తి విదానాన్ని అనుసరిస్తాయి . దాని నిర్భందం వల్ల , అది దీన్ని నాగరికత అంటుందొ దాన్ని సకల జాతులూ స్వీకరిస్తాయి -అనగా తామె బూర్జువా జాతులు ఔతాయి -ఒక్క మాటలొచెప్పాలంటె, బూర్జువా వర్గం తన్నుపొలిన ప్రపంచాన్ని స్రుస్టిస్తుంది (కమ్యునిస్టు పార్టి ప్రణాళిక} (నుంచి}

    ReplyDelete
  2. హమ్మ! కాలేజీలో కమ్యూనిష్టుల్లో చేరివుంటే ఇవన్నీ భట్టీయం పట్టించి జనామీదికి తోళేవాళ్ళేమో!

    ReplyDelete
  3. హమ్మ! కాలేజీలో కమ్యూనిష్టుల్లో చేరివుంటే ఇవన్నీ భట్టీయం పట్టించి జనాల మీదికి తోలేవాళ్ళేమో! :P

    ReplyDelete
  4. యుగాల దాస్య స్రుంకలాల నుంచి శ్రమదొపిడినుంచి నుంచి విముక్తి నిచ్చె సిద్దాంతంకమ్మునిజం అంటె అది కమ్మినిస్టు పార్టికి సంభందిన్సిన విషయమొ లెదా దానికిసంభందిన్సిన మనుషులకు సంభందిన్సిన విషయమొ అనుకుంటారు. చాలామంది ఇలానుకొనెది చదువురాని వాళ్ళె కాదు చదువుకున్నవాళ్ళు కుడా ఇప్పుడు వున్న సి పి యం ,సి పి ఐ పార్టిలను చూసి ఇదె కమ్యునిజం అనుకొకండి ఇవి కమ్యునిస్టు ముసుగు వెసుకున్న తొడెళ్ళు. ఒక డాక్టరు తప్పు చెస్తె తప్పు ఆ డాక్టరుది అంతెగాని వైద్యశాస్రానిది కాదు అలాగె ఈ పార్టిల వైకరి చుసి సిద్దాంతానికి ఆపాదించకండి ఒకరు భలవంతంగా భట్టియం పట్టిన్సల్చిన అవసరం లెదు కమ్యునిజం అంటె మానవ సమాజగమనాన్ని శాస్త్రియంగా వివరించిన సిద్దాంతం మార్స్కిజం అంటె ఏమిటొ తెలుసుకుని మాట్లాడండి కార్మికవర్గానికి యుగ

    ReplyDelete
  5. కమ్మునిజం అంటె అది కమ్మినిస్టు పార్టికి సంభందిన్సిన విషయమొ లెదా దానికిసంభందిన్సిన మనుషులకు సంభందిన్సిన విషయమొ అనుకుంటారు. చాలామంది. ఇలానుకొనెది చదువురాని వాళ్ళె కాదు చదువుకున్నవాళ్ళు కుడా ఇప్పుడు వున్న సి పి యం ,సి పి ఐ పార్టిలను చూసి ఇదె కమ్యునిజం అనుకొకండి . ఇవి కమ్యునిస్టు ముసుగు వెసుకున్న తొడెళ్ళు ఒక డాక్టరు తప్పు చెస్తె తప్పు ఆ డాక్టరుది అంతెగాని వైద్యశాస్రానిది కాదు అలాగె ఈ పార్టిల వైకరి చుసి సిద్దాంతానికి ఆపాదించకండి ఒకరు భలవంతంగా భట్టియం పట్టిన్సల్చిన అవసరం లెదు కమ్యునిజం అంటె మానవ సమాజగమనాన్ని శాస్త్రియంగా వివరించిన సిద్దాంతం మార్స్కిజం అంటె ఏమిటొ తెలుసుకుని మాట్లాడండి కార్మికవర్గానికి యుగయుగాల దాస్య స్రుంకలాల నుంచి శ్రమదొపిడినుంచి నుంచి విముక్తి నిచ్చె సిద్దాంతం పైకొటెషన్ సందర్బాని తగినట్టు వుటుందని ఇచ్చాను.పైది సుచుకొకుండా పంపినాను

    ReplyDelete
    Replies
    1. ఈ పాటను నేను మొదటి సారిగా ప్రజానాట్యమండలి వారు పాడగా 26.2.12న విన్నాను. ఎంతో హృద్యంగా వుంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నా చేత కన్నీరు పెట్టించిన పాట ఇది. ఈ పాటకు mp3 ఫైల్ దొరుకుతుందా.వుంటే లింక్ పంపించ గలరు.
      నా మెయిల్ : srinivasarao.thanga@gmail.com
      నా బ్లాగ్: iteacherz.blogspot.in

      Delete
  6. ఇక్కడ ఈ పాటపై మరోవ్యాసం

    http://sahitheeyanam.blogspot.in/2008/10/blog-post_26.html

    ReplyDelete