....

Footer Right Content

Tuesday, August 17, 2010

తెలుగు తేజానికి అరుదైన గౌరవం!


ఆదర్శ్ జాన్సన్ పేరిట టెక్సాస్ వర్సిటీలో స్మారక స్థూపం

అమెరికాలో హత్యకు గురైన తెలుగుతేజం ఆదర్శ్ జాన్సన్‌కు టెక్సాస్ యూనివర్సిటీ అరుదైన గౌరవం కల్పించింది. ఆయన హత్యకు గురైన నీటి కొలను ముందు ఓ స్మారక స్థూపాన్ని నిర్మించడమే గాక.. ప్రతి ఏటా ఆయనకు నివాళులర్పించాలని అధికారికంగా తీర్మానించింది. విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఓ విద్యార్థి పేరిట
ఇలా స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

చదువులో విశేష ప్రతిభ కనబర్చిన జాన్సన్.. రెండేళ్లలో పూర్తిచేయాల్సిన మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్-ఇన్‌ఫర్మేషన్ సిస్టం కోర్సును 14 నెలల్లోనే పూర్తిచేశారు. భారత్ నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఈ ఘనత సాధించిన తొలి విద్యార్థి జాన్సనేనని వర్సిటీ ప్రొఫెసర్లు ఆయన తల్లిదండ్రులకు వివరించారు.

జాన్సన్‌కు ప్రదానం చేయాల్సిన కోర్సు సర్టిఫికెట్‌ను యూనివర్సిటీ అధ్యక్షుడు రైన్డ్ ఓరేర్ ఓ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులకు అందజేశారు. తమ కుమారుడి హత్య కేసును సత్వరం ఛేదించేందుకు పాతికేళ్ల అనుభవమున్న ఇద్దరు మహిళా అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపిందని జాన్సన్ తల్లిదండ్రులు  వివరించారు.

1 comment:

  1. కుమారుడ్ని కోల్పోయిన ఆ కుటుంబానికి ఇదో చిన్న ఓదార్పు.మంచి సమాచారమిచ్చారు.యే పత్రికల్లోనూ ఈ వార్త వచ్చినట్టులేదు.

    ReplyDelete