....

Footer Right Content

Monday, August 16, 2010

విలువలకు గ్రహణం


హైదరాబాద్ : బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 15న, ఉదయం 10.30గంటలకు సుందరయ్య వికాస వేదిక ఆధ్వర్యంలో 'స్వాతంత్య్రం, సమాజం, సంస్కృతి' అంశంపై జరిగిన సదస్సులో చరిత్రకారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ప్రధాన ప్రసంగం చేశారు. మన దేశ స్వాతంత్య్రోదమం వలసదేశాలన్నింటిలో జరిగిన ఉద్యమాల కంటే విశిష్టమైనదని ఆయన తన ప్రసంగంలో
అన్నారు. అనేక తరగతులు , వర్గాలు, కులాలు, మతాలు ఉన్న మనదేశంలో బహుళ సంస్కృతుల వాతావరణం ఉందని వాటి మధ్య సామరస్య జీవన విధానముందని అదే మన దేశ సెక్యులరిజం అని ఆయన పేర్కొన్నారు. ఆ నేపథ్యంలోంచే వర్తమాన సమాజాన్ని చూడాలన్నారు.

జాతీయోద్యమ నేపథ్యాన్ని లోతుగా విశ్లేషించి సభికుల్లో ఆలోచనలు రేపారు. ఆనాటి జాతీయోద్యమం ప్రజాస్వామిక, లౌకిక భారతాన్ని కలిగిందని అంటూ వర్తమానం చూస్తుంటే నిరాశ కలుగుతుందని అన్నారు. ఆనాటి వారసత్వం ఈనాటి భారతదేశంలో చూడలేకపోతున్నామని అన్నారు. వర్తమాన సమాజంలో మార్కెట్‌ సంస్కృతి విజృంభించి ప్రజా జీవితంలో విషాన్ని విరజిమ్ముతోందని, మానవ విలువలను ధ్వంసం చేస్తోందని అన్నారు. అభివృద్ధి అనేది ప్రమాదకర పదంగా తయారయ్యిందని, అభివృద్ధి పేరుతో రైతుల నుండి భూములను లాక్కోవడం, సహజ వనరులను తమ దోపిడీకి వనరులుగా మార్చుకోవడం జరుగుతుందని అన్నారు. స్వాతంత్య్రం తర్వాత మనం చూస్తుంటే దేశం సాధించిన అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయో చాలా స్పష్టంగా తెలుస్తుందన్నారు. దేశంలో శత కోటీశ్వరుల సంఖ్యని చేసి ఆదే ఆలోచనాత్మక

సదస్సులు నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. సభాధ్యక్షత వహించిన సాహితీస్రవంతి రాష్ట్ర కన్వీనర్‌ రాష్ట్ర కన్వీనర్‌ తెలకపల్లి రవి మాట్లాడుతూ నేడు ప్రత్యేకంగా నెలకొన్న ఒక వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నామని , ఈ రోజున సెల్‌ఫొన్‌లో ఎంతసేపైనా మాట్లాడండి అని ఆయా కంపెనీలు హోరెత్తిస్తున్నాయని వాటి ఉద్దేశ్యం మార్కెట్‌ మాటలు తప్ప మానవ విలువలకు సంబంధించిన మాటలు కాదని అన్నారు. ఇటువంటి వాతవరణంలో సుందరయ్య వికాసవేదిక వంటివి సామాజిక ఆలోచనలకు వేదికగా రూపాందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేదికల ద్వారా ఒక అర్థవంతమైన చర్చకు అవకాశం లభిస్తోందని అన్నారు. జాతీయోద్యమంలో ఆనాడు నిరాడంబరత ధైర్యం, త్యాగం వంటి విలువలు ఆదర్శంగా ఉన్నాయని ఈనాడు ఆ పరిస్థితులు మరిపోయాయని అంతటా మార్కెట్‌ విషసంస్కృతి వ్యాపించిందన్నారు. వెలిగే భారతం,

రగిలే భారతంగా మారిన సందర్భంలో నేటి స్వాతంత్య్రదినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఆనాడు స్వావలంబన, ఆర్థిక సమానత్వం, లౌకికత్వం వంటి లక్ష్యాలతో కూడిన భారతదేశాన్ని నిర్మించుకోవాలని భావించారని వర్తమానం అందుకు భిన్నంగా తయారయ్యిందని తెలిపారు. ఈ వాతావరణం మార్చడానికి స్వాతంత్య్రోదమ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వై.సిద్దయ్య మాట్లాడుతూ ప్రతి నెలా మూడవ ఆదివారం సంస్కృతి, సామాజిక అంశాలపై ప్రసంగాలు, చర్చలు నడపాలని, వాటిలో ప్రసంగం, చర్చ అనంతరం ఆయా అంశాలపై కవులు, కళాకారులు నుండి కవితలు, పాటలను ఆహ్వానిస్తున్నామని అందుకోసమే సుందరయ్య వికాస వేదిక ఆవిర్భవించిందని అన్నారు. ఈ వేదికలో ఎక్కువగా పాల్గొని ఒక ప్రయోజనకర రీతిలో ఆసక్తికరంగా మార్చాలని

కోరారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మాజరైన సభికులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం వేదిక కన్వీనర్‌ వొరప్రసాద్‌ ఆధ్వర్యంలో జనకవనం జరిగింది. స్వాతంత్య్రం, సమాజం, సంస్కృతి అంశంపై కవులు తమ కవితలను చదవి వినిపించారు. తంగిరాల చక్రవర్తి, గజవెల్లి, శిల్పా జగదీష్‌, రజనీ గంగాధర్‌, శాంతారావు, కిశోర్‌, రఘుశ్రీ, కూర్మారావు తదితర కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సుకు సిపిఎం కార్యదర్శి బివి.రాఘవులు, మహిళా నాయకురాలు పుణ్యవతి, పలువురు కవులు, సాహిత్యాభిమానులు హాజరయ్యారు.

No comments:

Post a Comment