....

Footer Right Content

Sunday, September 12, 2010

శ్రీకృష్ణదేవరాయలు తెలుగోడు కాదా?

కాదనే అంటున్నారు కేంద్ర మానవ వనరులశాఖా మంత్రి డి.పురంధేశ్వరి. శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడే కాదని, ఆయన భార్యలు, రాజ్యాభిషేకం అంశాలోనూ పలు సందేహాలు ఉన్నాయని  మంత్రి పురంధేశ్వరి వివాదస్పద
వ్యాఖ్యాలు చేశారు. రవీంద్రభారతిలో శనివారం కెఆర్‌కెఎం మెమోరియల్‌ అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో రైతురాయల స్వర్ణచరితం సంగీత నృత్య రూపకం ప్రదర్శితమైంది. రూపకాన్ని ఆధ్యంతం తిలకించిన అనంతరం సభ
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పురంధేశ్వరి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి, లోక్‌సత్తాపార్టీ స్థాపక అధ్యక్షులు జయప్రకాశ్‌నారయణ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ- రాజారాజానరేంద్రుని వంటి తెలుగువాడైన రాజులు చరిత్రలో సంస్కృతి, సాహిత్యాలను పోషించిన వారు ఉండగా రాయలను మాత్రం తెలుగువాడు స్మరించుకోవడానికి కారణం తెలుగువాడు కానప్పటికీ తెలుగు సంస్కృతి, భాషలకు ఆయన చేసిన సేవాలేనన్నారు. నాడు రాయల పాలనలో తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించారని నేడు దేశంలో 200 భాషల్లో 20 మాత్రమే ప్రాచీన హోదా భాషలు అని, అందులో తెలుగు ఒకటని ఆమె తెలిపారు.
 

అయితే పురంధేశ్వరి వ్యాఖ్యలపై లోక్ సత్తా అధ్యక్షులు, ఎమ్మెల్యే జయప్రకాశ్‌నారాయణ పూర్తిగా విభేదించారు. రాయలు నిస్సదేహంగా తెలుగువాడేనని, రాజతంత్రం, రాజనీతిజ్ఞాత, లలితకళ పోషకుడు, సహితీప్రియుడని, వ్యవసాయం చేసే ప్రతివాడు నాడు కాపులేనని, కులబేధాలు వృత్తుల ఆధరంగానే ఉండేవాని వివరించారు. భాషాజాతీ  చిరునామా కాగా, ప్రపంచంలో పలుభాషల సమాహారంగా ఉన్న ఐక్య దేశం మనదని వివరించారు.  చిరంజీవితో పాటు  మరికొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ రాయలు తెలుగువాడా కాదా అనే విషయమై ఎటువంటి వ్యాఖ్యలు
చేయలేదు.

ఇంతకి శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడా? కాదా? అనే కొత్త ప్రశ్న  చర్చనీయాంశంగా మారింది.  దీనిపై ఇంకా
ఎటువంటి వ్యాఖ్యలు  వినిపిస్తాయో వేచిచూద్దాం...

8 comments:

  1. nammaru kaani srikrishna devaraayalu kannadigudu ani naaku telisina info. nenu modatlo nammaledu kaani tappadu nammali endukante idi nijam kaabatti

    ReplyDelete
  2. ఇది బహుదశాబ్దాల నాటి పాత చర్చ. ఎంతకాలం గడిచినా ఈ చర్చ తెగడంలేదు కూడా.

    శ్రీ కృష్ణదేవరాయలు ఆనాటి విజయనగరమనే ఒక పెద్ద కాస్మోపాలిటన్ రాజధానిలో బహుభాషా వాతావరణంలో పుట్టిపెఱిగిన వ్యక్తి. ఆయన తెలుగువాడని గానీ, కన్నడిగుడని గానీ ఢంకా బజాయించి చెప్పలేం. ఆయన తండ్రి కన్నడిగుడనీ, తల్లి తెలుగుస్త్రీ అనీ చెబుతారు. ఆయన యొక్క పెద్దభార్య/ సామ్రాజ్యపట్టమహిషి అయిన రాణీ చిన్నాదేవిగారు (శ్రీమతి కృష్ణరాయలు) నిస్సందేహంగా తెలుగుస్త్రీ. ఎందుకంటే ఆయన ఉదయగిరి (నెల్లూరు) రాష్ట్ర గవర్నరుగా ఉన్నప్పుడు ఆమె అక్కడ దాసిగా పనిచేసేది. ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని చరిత్రలు తెలియజేస్తున్నాయి. కృష్ణదేవరాయలు కన్నడకవుల్ని పోషించినట్లు ఆధారాలు లేవు. ఆయన స్వయంగా కన్నడంలో ఏమీ రాయలేదు. తెలుగులోనే రాశాడు. పైగా విజయనగరసామ్రాజ్యానికి తెలుగుని అధికారభాషగా ప్రకటించాడు. కనుక ఆయన పుట్టుకతో ఎవఱైనప్పటికీ మన తెలుగువాడుగానే, మనవాడుగానే మనం భావించాల్సి ఉంటుంది.

    ReplyDelete
  3. శ్రిక్రిష్ణ దేవరాయల బంధువులు, వంశం ఇంకా కొనసాగుతున్నప్పుడు హంపీలో, వారు తెలుగా, కన్నడమా అన్న మాట ఎందుకు? తుళువ వంశస్తులు కాకపోయినా, సాలువ వంస వారసులు ఇంకా కొనసాగుతున్న మాట వాస్తవమే. క్రిష్నదేవరాయలవారి వంశ వృక్షం కూడా కావాలంటే దొరుకుతుంది.

    వారు నిక్కచ్చిగా కన్నడిగులే పుట్టుకతో (తండ్రి తరుపునుండి అయినా), కాకపోతే ఆయన కన్నడ ప్రభువుగా కంటే తెలుగు ప్రభువుగానే కొనసాగాడు అని చెప్పవచ్చు, ఆయన రాజ్యంలో ముఖ్యంగా సైన్యం లో సిమ్హ భాగం వహించినది తెలుగు వారే, వారిలో చాలా మంది ప్రస్తుతం మధురై నుంది కంచీవరకు ఉండి తమిళులలో కలసిపోయినా,
    ఆయన చేసిన భాషా సేవ, అంతేకా వారి హయంలో తెలుగు సెనాపతులకు, తెలుగు కవులకు ఇచ్చిన ఆదరణ, తెలుగు నేలకు ఓ ప్రక్క తురకదగ్గరనుండి, మరో ప్రక్క కళింగుళనుండి ఇచ్చిన రక్షణ మనం మరచి పోక గురుతుపెట్టుకోవటం మన తెలుగు నేలను పాలించి మన తెలుగు ప్రభువుగానె కొనసాగిన వానిని మనం గౌరవించుకోవటమే!!

    ఇక jp అన్నట్లు ఇప్పుడు మిగిలి ఉన్న భూస్వామ్య కులాలు కమ్మ, కాపు, తెలగ, రెడ్డి, యాదవులు (etc.) లాంటివి అన్నీ ఆయా ప్రాంతాలలో "కాపు" (కాపలాకాసేవాడూ) అని పిలిపించుకొన్నవే, అంతమాత్రం చేత క్రిష్ణదేవరాయల మాతృభాష తెలుగు కావచ్చు, కాకపోవచ్చు, ఆయన మాత్రం 100 శాతం తెలుగు ప్రభువు అన్నది నిజం.

    ReplyDelete
  4. నిస్సందేహం గా ఆయన కన్నడ విభుణ్ణని ప్రకటించుకున్నాడు. మరి అధికార భాషగా 'తెలుగుగదేలయన్న......' అనీ ప్రకటించాడు.

    అయినా, కొన్ని వందలేళ్ల క్రితం ఇక్కడ బ్రతికాడు అని చెప్పుకొనే ఓ రాజు గురించి ఇంత చర్చ అవసరమా?

    నెహ్రూ భారతీయుడేనా? అని చర్చ మొదలుపెడితే యెలా వుంటుంది?

    వుదాహరణకి, కాటన్ దొరనే తీసుకోండి. ఆయన తన వుద్యోగ ధర్మాన్ని సిన్సియర్ గా నిర్వర్తించి, గోదావరి మీద ఆనకట్ట కడితే, ఇలా వుంటుంది అని తన రిపోర్టు అప్పటి ప్రభుత్వానికి సమర్పించాడు. అంతే.

    ప్రభుత్వం కట్టించింది--యెలా? అల్లూరి సీతారామరాజు సినిమాలో చూపించినట్టు, కాంట్రాక్టర్ల ద్వారా, మన మన్య జీవుల చేత బానిసలుగా పని చేయించి!

    (అర్థం అవడానికి అలా వ్రాశానంతే--నిజానికి సీతారామరాజుకీ, కాటన్ దొరకీ మధ్య చాలా సంవత్సరాలు యెడం వుంది.)

    అసలు రాజీవ్ గద్దెనెక్కేదాకా మన బానిసత్వం ఇంకా కొనసాగుతోందని యెవరూ అనుకొనేవాళ్లు కాదు. భా జ పా యెత్తులకి పై యెత్తులు వెయ్యాలని, ఆయన బానిస బుధ్ధుల్ని తిరిగి దేశస్థుల్లో ప్రవేశ పెట్టాడు.

    అప్పణ్నించీ, చోటా మోటా రా నా లు చెలరేగిపోయి, కాటన్ కి విగ్రహాలు కట్టించడం మొదలు పెట్టారు! ఆయన ప్రాతః స్మరణీయుడు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు, కొన్ని వందల విగ్రహాలు ఇప్పటికి కట్టించారు.

    సరే--ఇక పిడకలవేట యేమిటంటే, ఆవిడ అసలు పేరేమిటి?

    పురందేశ్వరి; పురంధేశ్వరి; పురంధ్రేశ్వరి; పురందరేశ్వరి; ఇంకేమిటి?

    పత్రికల్లో ఇవన్నీ వాడుకలో వున్నాయి మరి.

    జయలలిత తన పేరు ఇంగ్లీషు వర్ణక్రమం లో ఒక "ఏ" ని యెక్కువగా చేర్చుకుంటే శుభం జరుగుతుందని యెవరో శాస్త్రఙ్ఞులు చెపితే, ఆవిడ ఆమోదించి, మర్నాటినించీ అందరూ తన పేరు అలాగే వ్రాయాలని హుకుం జారీ చేస్తే, మన ఇంగ్లీషు పేపర్లు చచ్చినట్టు అవలంబించ లేదా?

    ఈ పురందరేశ్వరి అలా యెందుకు చెయ్యదు?

    ReplyDelete
  5. తాడేపల్లి గారు, విజయనగర చరిత్ర, రాయల వైభవాన్ని వర్ణించిన చాలా పుస్తకాలలో తెలుగు కి సంభందించిన ప్రస్తావన అరుదుగా ఉంటుంది. ఉదా! విజయనగర చరిత్రపై సంపూర్ణ అధ్యయనం చేసిన గ్రంధం The Forgotten Empire లో కూడా తెలుగు ప్రాంతల గురించి, భాష గురించి కొద్దిచోట్ల మాత్రమే ప్రస్తావించారు. కాని మిగిలిన విజయనగర రాజులతో పోల్చితే కృష్ణదేవరాయల కాలం లో తెలుగు కి ఘనవైభవం దక్కిందనటానికి ఆధారాలున్నాయి.

    ReplyDelete
  6. దక్షిణ కోస్తా కర్నాటక ప్రాంతాన్ని తుళు అంటారు. కాబట్టి రాయలు తెలుగువాడు కాకపోవచ్చు. త్యాగరాజు తెలుగు మాతృభాష కల తమిళుడు.
    ఆ చర్చ పిడకల వేటనే. తన అజ్ఞానం బయటపడకుండా గప్ చుప్ గా వుండిన మెగాస్టార్ ధన్యుడు సుమతీ అనుకోవాలి. :)

    ReplyDelete
  7. రాయలు తెలుగు వాడా, కన్నడిగుడా అనే ప్రశ్నకి సమాధానం ఎలా ఉన్నా, మూడేళ్ళ క్రితం మా హ్యూస్టన్ లో కృష్ణదేవరాయల పరిపాలన, సాహిత్య కృషి మొదలైన విషయాల మీద అమెరికా, ఐర్లండ్, ఇంగ్లంద్, కెనడా, ఇండియా మొదలైన దేశాలనుంచి చారిత్రకారులు, పరిశోధకులు వచ్చిన ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. మొత్తం అమెరికాలోనే ప్రతిష్టాత్మకమైన హ్యూస్టన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వారు, స్థానిక కన్నడ సంఘం వారూ ఈ సదస్సు ప్రధాన నిర్వాహకులు. ఆ మహా సభలో కృష్ణదేవరాయల తెలుగు భాషాపోషణ, ఆముక్త మాల్యద రచన, "దేశభాలందు తెలుగు లెస్స" పద్యానికి ఉన్న ప్రాధాన్యత, రాయల తెలుగు పాండిత్యం, అష్టదిగ్గజాలు భువన విజయం విశేషాలు మొదలైనవాటిపై నేను ఒక ప్రత్యేక ప్రసంగం చేశాను. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగింఛే విషయం ఏమిటంటే, ఆ అంతర్జాతీయ సభకు వచ్చిన ఇద్దరో, ముగ్గురో తెలుగు వారికి తప్ప, ఇతర పండితులకీ, ముఖ్యంగా కన్నడిగులకి కూడా "అతను తమిళం, కన్నడం, తుళు భాషలలో పండితుడు అని తెలుసు కానీ, కృష్ణ దేవరాయలకి తెలుగు కూడా వచ్చునా?, " అని ముక్కు మీద వేలువేసుకున్నారు. రాయల జీవితంలో తెలుగు భాష ప్రభావం చరిత్రకారుల దృష్టికి అంతగా రాకపోయినా, తెలుగు వారి జీవితంలో రాయల ప్రభావం మకుటాయమైనది అని మనకి తెలుసు.

    -వంగూరి చిట్టెన్ రాజు
    హ్యూస్టన్, టెక్సస్.

    ReplyDelete
  8. చిట్టెన్ రాజు గారిలాంటి తెలుగు తేజాలు ఇంకా కృషి చేస్తున్నారు కాబట్టే ఇంకా తెలుగు అనేదొకటి వుంది అని పాశ్చాత్యులూ, ప్రవాస తెలుగువాళ్లూ గుర్తిస్తున్నారు.

    ఆయన కృషి ప్రశంసనీయం.

    ReplyDelete