....

Footer Right Content

Wednesday, September 15, 2010

అద‏రగొట్టిన 'మగధీర'


జాతీయస్థాయిలో వెండితెర అవార్డుల జాబితా వెలువడింది. సినీ అవార్డుల పండుగలో కేరళ తారలు మరోమారు వెలిగాయి. వైవిధ్యం బాటలో నడుస్తూ ప్రేక్షకుల గుండెను తాకుతున్న బాలీవుడ్ అత్యధిక అవార్డులు అందుకుని విజయ పతాక ఎగురవేసింది.  మలయాళం, హిందీ చిత్రాలు పోటాపోటీగా అవార్డులు సాధించాయి.  తెలుగు సినిమాకూ రెండు అవార్డులు లభించాయి.


కలెక్షన్ల రికార్డులను తుత్తునియలు చేసిన తెలుగు 'మగధీర' రెండు జాతీయ అవార్డులు సాధించింది. ఈ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన కమల్ కణ్నన్, కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన శివశంకర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. బుధవారం 57వ జాతీయ సినీ పురస్కారాల జాబితా వెలువడింది. మలయాళ చిత్రం 'కుట్టి శ్రాంక్' జాతీయ ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దుస్తుల అవార్డులతోపాటు న్యాయ నిర్ణేతల ప్రత్యేక గుర్తింపు పురస్కారాన్ని కూడా సాధించింది. 

1 comment:

  1. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రమే లేదా?????

    ReplyDelete