....

Footer Right Content

Sunday, September 5, 2010

హైదరాబాద్ హలీంకు అరుదైన గౌరవం


హైదరాబాద్ హలీంకు ప్రపంచంలోనే అరుదైన గౌరవం దక్కింది. హలీం పేటెం ట్ కోసం కొన్నేళ్లుగా చేస్తున్న శ్రమకు ఫలితం లభించింది. రంజాన్ మాసంలోనే పేటెంట్ దక్కడం హలీం ప్రియులను ఆనందంలో ముంచెత్తింది. కేంద్ర ప్రభుత్వ జా గ్రఫికల్ ఇండికేషన్స్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లిలోని గ్రాండ్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో పేటెంట్ సర్టిఫికెట్ ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చే సిన పేటెంట్ కంట్రోలర్ జనరల్ పీహెచ్. కురియన్ చేతుల మీదుగా హలీం మేకర్స్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు
ఎం.ఎ.మాజిద్ పేటెంట్ సర్టిఫికెట్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా కురియన్ మాట్లాడుతూ హైదరాబాద్ హలీంకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్ హలీంకు పేటెంట్ లభించడం దేశానికి గర్వకారణంగా ఆయన అభివర్ణించారు. ప్రత్యేక వస్తువులపై పేటెంట్ పొందడం వల్ల భవిష్యత్‌లో అనేక ఉపయోగాలు ఉంటాయని చెప్పారు.

హైదరాబాద్ గాజులకు కూడా ప్రత్యేక గుర్తిం పు ఉందని, అయితే పేటెంట్ పొందేందుకు ఎవకూ చొరవ చూపడంలేదని అన్నారు.  డార్జిలింగ్‌టీ మాదిరిగా హైదరాబాద్ హలీంకు ఘనమైన గుర్తింపు లభించిందని పే ర్కొన్నారు.  పిస్తా హౌజ్ ఎండీ, హలీంమేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎ.మాజిద్ మాట్లాడుతూ హలీంకు పేటెంట్ లభించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన ఇఫ్తార్ విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ ధనాని, ఏఐపీసీ కన్సల్టంట్ ఎస్.రవి, ఇండియా పేటెంట్ ఆఫీస్ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ కల్పన శాస్త్రి, నేషనల్ మీట్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.కొండయ్య, ఎపీటీడీసీ డైరెక్టర్ సుబోధ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment