* నేడు ఉపాధ్యాయ దినోత్సవం
రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన యువతను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత నేటి ఉపాధ్యాయులపైనే ఉంది. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ, సహనంతో విజయాలు సాధించడం గురుపూజోత్సవ వైభవాన్ని, విశిష్టతను తెలియజేస్తుంది. నేటి సమాజంలో విలువలు, క్రమశిక్షణ లోపించి గురువులపైనే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. కొందరు ప్రజానాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు. ఆవేశంతో రెచ్చగొట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్న తరుణంలో యువత భవిష్యత్తును పరిరక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.
అదే సమయంలో ఈమధ్యకాలంలో కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తన సమాజానికి తలవంపులుగా మారింది. విద్యార్థుల తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దురదృష్టకరం. రోజూ పత్రికల్లో ఉపాధ్యాయుల గురించిన ఏవో సంఘటనలు కనిపిస్తూనే వుంటాయి. ఇది సభ్యసమాజానికి తలవంపులు. ఏదేమైనప్పటికీ నేటి సమాజంలో ఉన్నత విలువలను, విశిష్టతను కాపాడాల్సిన గురుత బాధ్యత గురువులపైనే వుంది.
No comments:
Post a Comment