ఆధునిక యుగంలోనూ గిరిజనులు మూఢ విశ్వాసాల నీడనే బతుకుతున్నారు. వారిలో చైతన్యం నింపాల్సిన అధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారు. పాముకాటుకు మంత్రం, తేలు కుడితే నాటు వైద్యం జ్వరం వస్తే తాయత్తు వంటివి గ్రామాల్లో నేటికీ చెలామణీలో వున్నాయి. దీని ఆధారంగా నాటు వైద్యులలు బతికేస్తున్నారు. మూఢ నమ్మకాల ముసుగులో పడి అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతినిత్యం గిరిజన ప్రాంతాల్లోనేకాక మారుమూల పల్లెల్లో కూడా చోటు చేసుకుంటూనేవున్నాయి. అధికారులు వారిలో చైతన్యం నింపడానికి చేస్తున్న ప్రయత్నాలు, ప్రభుత్వ పథకాలు శూన్యం. ఎన్ని స్వాతంత్య్రదినోత్సవాలు జరుపుకున్నా.... వీరి బ్రతుకులు మారవు. అంతేకాకుండా గిరిజన తండాల్లో ఆడపిల్లల విక్రయాలు, భౄణహత్యలు, చేతబడులు, నాటువైద్యం, మంత్ర తంత్రాలు నిత్యం చోటుచేసు కుంటూనే వున్నాయి. దీనికి ప్రధాన కారణం- పేదరికం, నిరక్షరాస్యత. గిరిజనుల్లో చైతన్యం లేకపోవడం వల్ల వారు ఆడ పిల్లలను విక్రయించడం, లేదా పురిటిలోనే పీకపిసికి చంపేస్తున్న సంఘటనలు అనేకం జరుగుతూనే వున్నాయి.
గిరిజన తండాల్లో అభివృద్ధికి ఆమడదూరంలో జీవితాలను వెల్లబుచ్చుతున్న వీరిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వీరి అభివృద్ధికోసం నిస్వార్థంగా కృషిచేయాలి. అప్పుడే వీరి జీవితాలలో వెలుగులు నిండుతాయి.
No comments:
Post a Comment