ఇతర దేశాల్లో మానవ హక్కుల గురించి పదే పదే మాట్లాడే అమెరికా తన వరకు వచ్చేసరికి అవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ యథేచ్ఛగా వాటిని ఉల్లంఘిస్తోంది. మానవ హక్కుల హననంపై ఇతర దేశాలకు సుద్దులు చెప్పడం రివాజుగా పెట్టుకున్న అమెరికా, దోషులుగా తేలని విద్యార్థులను నేరస్తుల కంటే హీనంగా చూస్తోంది. వీసాల దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రై-వ్యాలీ యూనివర్శిటికి చెందిన మన రాష్ట్ర విద్యార్థుల పట్ల అమెరికా అధికారులు అమానుషంగా
వ్యవహరిస్తున్నారు. ఈ మోసంతో తమకెలాంటి సంబంధమూ లేదంటూ విద్యార్థులు ఇప్పటికే అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా విద్యార్థుల కదిలికలను గమనించడం కోసం వారికి రేడియో ట్రాకర్లు అమర్చారు.. ట్రై-వ్యాలీ యూనివర్శిటీలోని వందలాది మంది భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. ఇప్పటికే వీరు అర్థంతరంగా చదువులకు స్వస్తి చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల పట్ల అధికారుల తీరు మరింత దిగ్భ్రాంతి కలిగింది.
కొందరు విద్యార్థులకు రేడియో ట్రాకర్లు అమర్చారు. ఆర్‌ఎఫ్‌ఐడిగా పిలిచే ఈ సాధనం ద్వారా సదరు విద్యార్థి కదలికలు, ఆచూకీ తెలుసుకోవడం సాధ్యపడుతుంది. అయితే దీనిపై విద్యార్థులెవరూ మాట్లాడలేదు.
అమెరికాలోని తెలుగువారికి ప్రాతినిథ్యం వహిస్తున్న తానాకు చెందిన విద్యార్థుల కమిటీ ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ ఇప్పటికే పలువురు విద్యార్థుల పాస్‌పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఆ ప్రాంతాన్ని వీడి పోకుండా వారికి దిక్సూచి పరికరాలు, , రేడియో ట్రాకర్లు అమర్చి అమానవీయంగా వ్యవహరించారని తానా విద్యార్థుల కమిటీ చైర్‌పర్సన్ పేర్కొన్నారు. ఈ విషయం తెలియడంతో మానవ హక్కుల కార్యకర్తలు భగ్గుమన్నారు. దోషులుగా నిర్ధారణ కాకుండానే విద్యార్థుల పట్ల అమెరికా ఈ విధంగా స్పందిస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తుల పట్ల కూడా ఈ విధంగా వ్యవహరించరని విమర్శించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్రై-వ్యాలీ యూనివర్శిటీ వీసా మోసాలకు పాల్పడిందని, వీసా పర్మిట్లను దుర్వినియోగం చేసిందని, మనీ లాండరింగ్‌తోపాటు ఇతర నేరాలను పాల్పడిందని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరోపించారు. దీనిపై కాలిఫోర్నియాలోని కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. అక్రమంగా ఇమ్మిగ్రేషన్ పొందడానికి కొందరు విదేశీయులకు ఈ యూనివర్శిటీ సహకరించిందని ఫిర్యాదులో పేర్కొనడంతో వర్శిటీపై దాడులు చేసిన అధికారులు, దాన్ని మూసేసిన సంగతి తెలిపిందే. అందులో మొత్తం 1,555 విద్యార్థులుండగా 95 శాతం మంది భారతీయవిద్యార్థులున్నారు.
ఈ నేపథ్యంలో అర్థంతరంగా తమ చదువులు ఆగిపోకుండా చూడాలని, తాము ఎలాంటి చట్టాలనూ ఉల్లంఘించలేదని భారతీయ విద్యార్థులు భారత కాన్సుల్ జనరల్ సుస్మితా గంగూలీ థామస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే సుమారుగా రెండు డజన్ల మంది విద్యార్థులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారని లేదా నిర్బంధంలోకి తీసుకున్నారని ధ్రువీకరించని వార్తలొచ్చాయి. దేశం విడిచి పోవాలని ఎక్కువ మంది విద్యార్థులను కోరినట్లు ఆ వార్తలు తెలియచేస్తున్నాయి. తమను ఆశ్రయించిన కొందరు విద్యార్థులను ఐఎస్‌ఎపి (ఇంటెన్స్ సూపర్‌విజన్ అండ్ అప్పీరెన్స్ ప్రోగ్రాం) కింద పెట్టామని ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) అధికారులు తెలియచేశారు. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియచేయడానికి ఐసిఇ తిరస్కరించింది. ఆ విషయం దర్యాప్తులో ఉందని పేర్కొంది.
భారత విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్
ట్రై-వ్యాలీ యూనివర్శిటీకి చెందిన భారతీయ విద్యార్థుల కోసం అమెరికా ఐసిఇ ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఐసిఇ అధికార ప్రతనిధి లరి కె హాలే మాట్లాడుతూ 'సందేహాలపై ఐసిఇ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తులపై సందేహాలుంటే సంప్రదించడం కోసం ట్రై-వ్యాలీ విద్యార్థుల కోసం ఈ-మెయిల్ అడ్రస్, వాయిస్ మెయిల్ ఏర్పాటు చేశాం' అని చెప్పారు. విద్యార్థులు 415-844-5320 నెంబర్‌కు ఫోన్ చేసి వాయిస్ మెయిల్ పంపాలని చెప్పారు. ఐసిఇ ప్రతినిధి తిరిగి ఫోన్ చేస్తారని తెలిపారు. దీంతోపాటు విద్యార్థులు సమాచారం కోసం 'ఎస్‌ఎఫ్‌ఆర్‌హెచ్‌ఎస్‌ఐఎఫ్‌ఏ డిహెచ్‌ఎస్.జిఓవి'కు రాయాలని చెప్పాలని చెప్పారు.

How to get to TAB Casino in Wilkes-Barre - JTGHub
ReplyDeleteIf you are an Indian Casino player and want to 익산 출장샵 learn more 양주 출장샵 about playing 안성 출장마사지 casino games, 안양 출장마사지 visit JTG 전주 출장샵 Casino.