
పద్మ పురస్కారాల్లో తెలుగు తేజాలు పరిమళించాయి. ప్రముఖ ఆర్థిక వేత్త, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ యాగా వేణుగోపాల్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ప్రతాప్ చంద్ర రెడ్డిలకు భారత రత్న తర్వాత అత్యంత ఉన్నతమైన పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి. పద్మవిభూషణ్ లభించిన ఆరుగురిలో ఇద్దరు తెలుగువారు కావడం విశేషం. ప్రముఖ కర్ణాటక సంగీతకారుడు నూకల చిన్న సత్యనారాయణకు పద్మభూషణ్ లభించింది. కాగా అన్నమయ్య కీర్తనలతో అఖిలాంధ్ర కోటిని ఓలలాడించిన ప్రముఖ గాయని శోభారాజ్, జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ డైరెక్టర్, ప్రముఖ భూభౌతిక శాస్త్రవేత్త డా. విజయ్ ప్రసాద్ దిమిరి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఎవిఎస్‌రాజు)లకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
No comments:
Post a Comment