....

Footer Right Content

Sunday, January 30, 2011

రాష్ట్ర విద్యార్థులకు రేడియో ట్రాకర్లు : అమెరికా అమానుషం

ఇతర దేశాల్లో మానవ హక్కుల గురించి పదే పదే మాట్లాడే అమెరికా తన వరకు వచ్చేసరికి అవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ యథేచ్ఛగా వాటిని ఉల్లంఘిస్తోంది. మానవ హక్కుల హననంపై ఇతర దేశాలకు సుద్దులు చెప్పడం రివాజుగా పెట్టుకున్న అమెరికా, దోషులుగా తేలని విద్యార్థులను నేరస్తుల కంటే హీనంగా చూస్తోంది. వీసాల దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రై-వ్యాలీ యూనివర్శిటికి చెందిన మన రాష్ట్ర విద్యార్థుల పట్ల అమెరికా అధికారులు అమానుషంగా

Tuesday, January 25, 2011

మన తెలుగు ‘పద్మా’లు


 దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావును ఈసారి పద్మవిభూషణ్ పురస్కారం వరించగా, క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. 2010 సంవత్సరానికిగాను ‘పద్మ’ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ‘పద్మ’పురస్కారాలకు 128మంది ఎంపిక కాగా, వారిలో  31మంది మహిళలున్నారు.

Tuesday, January 18, 2011

శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తి పాఠం తెలుగులో...

శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తి పాఠం తెలుగులో...

తెలుగు పుస్తకాలు

- గుర్రం జాషువా ‘‘గబ్బిలము’’
- ఆరుద్ర  ‘‘నే చెప్పానుగా’’
- డాక్టర్ సి.నారాయణరెడ్డి ‘‘గాంధీయం’’
- అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’
- అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’
- అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’
- అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’
- అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’ 
- అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’
- అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’ 
- అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’
- అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’ 
- అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’ 

Sunday, January 16, 2011

వికీపీడియా పదేళ్ల ప్రస్థానం

కంప్యూటర్‌ ప్రపంచంలో విహరించే వారికి వికీపీడియా అంటే ఏమిటో తెలియంది కాదు. ఆవిర్భవించిన పదేళ్ల కాలంలోనే అసంఖ్యాక నెటిజన్ల ఆదరణ చూరగొంది. 2001, జనవరి 15న జిమ్మీ వేల్స్‌ వికీపీడియాను నెలకొల్పారు. అంతకు ముందు ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా నూపెడియా విఫలమైన నేపథ్యంలో వికీపీడియా స్థాపనకు

Thursday, January 13, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 13

ఆరోగ్యం.. నిదానం
శ్రీకృష్ణ కమిటీ రాష్ర్టంలోని మూడు ప్రాంతాలలో పర్యటించినపుడు గానీ, హైదరాబాద్‌లో వివిధ గ్రూపులతో చర్చించినపుడు గానీ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ఎవరూ ప్రస్తావించలేదు. మనిషి జీవనవిధానంలో ఆరోగ్యం కూడా ఒక ముఖ్యమైన సూచిక కనుక రాష్ర్టంలోని 3 ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య సదుపాయాలు, ఆరోగ్య ఫలితాల గురించి శ్రీకృష్ణ కమిటీ చర్చించింది.

శ్రీకృష్ణ సందేశం - 12

ఆర్థికంగానూ ఆటంకమే...
ఆర్థిక కోణాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా దేశాలకు దేశాలే ఆర్థికంగా సమైక్యమవుతున్నాయి. ఆర్థికావకాశాలను, మార్కెట్లను, ఉద్యోగావకాశాలను పెంచుకునేందుకు ఆర్థిక బ్లాకులుగా ఏర్పడుతున్నాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంతర్రాష్ట్ర, దేశీయ వర్తకానికి, సరుకులు, సేవల రవాణాకు అడ్డంకిగా మారుతుందన్నది సాధారణంగా ఉండే అభిప్రాయం. ఉదాహరణకు రకరకాల స్థానిక

శ్రీకృష్ణ సందేశం - 11

వివక్ష భావన పోగొట్టాలి!
విద్యకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ చెప్పిందిదీ..

స్కూళ్లకు పంపించడం (ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు) విషయంలో గత కొన్ని దశాబ్దాలలో మంచి పురోగతి ఉంది. మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో.. ప్రత్యేకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో హైస్కూళ్లు, జూనియర్ కాలేజీలు పెరి గాయి. మూడు ప్రాంతాల్లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్,

శ్రీకృష్ణ సందేశం - 10

శాంతిభద్రతలు.. అంతర్గత భద్రత

అధ్యాయం-8
కమిటీ తన విధుల్లో భాగంగా... తక్షణ శాంతిభద్రతల సమస్యలు, దీర్ఘకాలంలో మావోయిస్టుల కార్యకలాపాలతోపాటు అంతర్గత భద్రతకు సంబంధించి ఏర్పడనున్న చిక్కులను పరిశీలించింది. ఈ భయాందోళనలను ఆయా రాజకీయ పార్టీలు, వివిధ ఇతర గ్రూపులు కమిటీకి సమర్పించిన వినతిపత్రాల్లో వ్యక్తం చేశాయి. అలాగే కమిటీ రాష్టస్థ్రాయిలో విభిన్న భాగస్వాములతో జరిపిన సమావేశాలు, అదేవిధంగా గ్రామాలను సందర్శించినప్పుడు జరిపిన సంభాషణల సందర్భంగా కూడా ఇవి వ్యక్తమయ్యాయి.

మరోవైపు.. సభ్య కార్యదర్శి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం (17 జిల్లాల్లో)తో విడివిడిగా సంప్రదింపులు జరిపారు. ఇందుకు సంబంధించి ఇతర వనరుల నుంచి సమాచారాన్ని సేకరించాం. పైన పేర్కొన్న అంశాలన్నింటినీ కవర్ చేస్తూ ఒక నోట్ తయారు చేశాం. దీనిని ఈ నివేదికతోపాటు విడిగా ఒక కవరులో పెట్టి హోం మంత్రిత్వశాఖకు సమర్పిస్తున్నాం. నివేదికకు చెందిన తొమ్మిదో అధ్యాయం ‘ది వే ఫార్వర్డ్’ను రూపొందించడంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంది.

శ్రీకృష్ణ సందేశం - 9

సాంస్కృతిక విలక్షణత విభజనకు ప్రాతిపదిక కాదు!

అధ్యాయం-7
* ఆంధ్రప్రదేశ్ విభజన.. అత్యంత సంక్లిష్ట సమస్య
* వ్యవసాయ, గ్రామీణ సంక్షోభం.. ఆత్మహత్యలతో ఉద్యమానికి ఊపు
* సాంస్కృతిక వివక్ష ఉంటే అది ఆందోళన కలిగించే తీవ్రమైన అంశం
* తెలంగాణ ఇస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం రావొచ్చు

శ్రీకృష్ణ సందేశం - 8

అభివృద్ధి ఇంజన్ హైదరాబాద్

అధ్యాయం-6
* హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా చూడాలి
* నగరం అందరికీ అందుబాటులో ఉండాలి
* దీని ఆర్థిక పురోగతి కొనసాగితే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి
* అభివృద్ధి జరగాలంటే.. అనిశ్చిత వాతావరణం కొనసాగకూడదు
* విధాన నిర్ణేతల సామర్థ్యంపైనే భాగ్యనగరం భవిష్యత్తు ఆధారపడి ఉంది
* ఏడాదికి 10.6 శాతం జనాభా నగరానికి వలస వస్తున్నారు
* వలసదారులు.. ప్రత్యేకించి కోస్తావారు నగర ఆర్థికాభివృద్ధిలో కీలక భాగస్వాములు
* నగరంతో మూడు ప్రాంతాల ప్రజలకూ బలమైన మానసిక అనుబంధం

శ్రీకృష్ణ సందేశం - 7

ఉద్యోగాల్లో ప్రాంతీయ సమతుల్యత పాటించాలి

అధ్యాయం-5
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజల ఆందోళనకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ ఏమందంటే...
‘‘ప్రభుత్వరంగ ఉద్యోగాలకు సంబంధించి.. అన్ని వాస్తవాలను, భాగస్వాములందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలించి విశ్లేషించిన తర్వాత కమిటీ ఈ కింది నిర్ధారణలకు వచ్చింది.

శ్రీకృష్ణ సందేశం - 6

జల ఫలం ఇలా..

అధ్యాయం-4

సాగునీటి రంగంపై కమిటీ విశ్లేషణ
ఏ ప్రాంతమూ వివక్షకు గురికాలేదు
అక్కడక్కడా సమస్యలున్నా.. పరిష్కరించవచ్చు
తెలంగాణకూ పోల‘వరమే’
విద్యుత్ వినియోగం తెలంగాణలోనే అధికం

శ్రీకృష్ణ సందేశం - 5

ఉన్నత విద్యాసంస్థల్ని విస్తరించాలి

అధ్యాయం-3
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 3వ అధ్యాయం తొలిభాగంలో విద్య, రెండోభాగంలో ఆరోగ్యంపై చర్చించారు.
ప్రజల నాణ్యమైన జీవన విధానానికి విద్య, ఆరోగ్య పరిస్థితులే ముఖ్యమైన సూచికలు. విద్య కేవలం

శ్రీకృష్ణ సందేశం - 4

ఆర్థిక సమానత్వం అవసరం

అధ్యాయం-2
నిర్లక్ష్యానికి గురైంది రాయలసీమే
తెలంగాణ కంటే వెనుకబడింది
తెలంగాణలో హైదరాబాద్ నగరంపైనే దృష్టి
మిగతా ప్రాంతాలు నిరాదరణకు గురయ్యాయి
గతంలో నిర్లక్ష్యం, వివక్ష నిజమే...ఇటీవల సమాన వాటా
హైదరాబాద్ ఉన్నా లేకున్నా ఆర్థికంగా తెలంగాణకు ఢోకా లేదు
హైదరాబాద్ అందరికీ అందుబాటులో ఉండాలి
వృద్ధిరేటు కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోనూ బాగానే ఉంది

శ్రీకృష్ణ సందేశం - 3

ఒప్పందాల అమలే కీలకం!

అధ్యాయం-1

శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక మొదటి అధ్యాయంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి చోటుచేసుకున్న పరిణామాలను నాలుగు దశలుగా విభజించి చెప్పింది. 1956-73 (విశాలాంధ్ర ఏర్పాటు నుంచి జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల ముగింపు దాకా), 1973-2000, 2001-2009 (టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి 2009 దాకా), నవంబరు 29, 2009- డిసెంబరు 31, 2010 (కేసీఆర్ దీక్ష నుంచి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ దాకా)... ఇలా నాలుగు భాగాలుగా విడగొట్టింది. పరిచయంలో ఆంధ్ర ఏర్పాటు, నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కావడం, ఆపై విశాలాంధ్ర ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను వివరించింది. పార్లమెంటు, శాసనసభ ప్రసంగాలు, ప్రభుత్వ అధికారిక గెజిట్‌లనే కాకుండా... ఒడంబడికలను, ఒప్పందాలను, వివిధ సందర్భాల్లో చరిత్రకారులు, ప్రముఖ నాయకులు రాసిన పుస్తకాల్లో పేర్కొన్న విషయాలను ప్రామాణికంగా తీసుకొని ఉదహరించింది.

‘‘చారిత్రకమైన పెద్ద మనుషుల ఒప్పందంలోని కొన్నింటిని అమలు చేయకపోవడంతో రాష్ట్ర విభజన డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే... మరో ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవినివ్వాలనేది ఒప్పందంలోని ఓ ముఖ్యాంశం. ఒప్పందంపై సంతకం చేసిన వారిలో ఒకరైన నీలం సంజీవరెడ్డియే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా దీనికి ససేమిరా అన్నారు. డిప్యూటీ సీఎం పదవిని ఆరోవేలుగా ఆయన అభివర్ణించినట్లు వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ వాదుల్లో అసంతృప్తి రగలడానికి ఇదో ముఖ్య కారణమైంది. జల వనరుల పంపకం, భూమి యాజమాన్యం అంశాలు కూడా వివాదాస్పదమయ్యాయి. 1960లో దామోదరం సంజీవయ్య .. కె.వి.రంగారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా అసమతౌల్యతను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ఏర్పాటు రెండేళ్లకే పరిమితమైంది.

సంజీవ రెడ్డి మళ్లీ సీఎం కాగానే డిప్యూటీ అక్కర్లేదన్నారు. మళ్లీ 1969లో జై తెలంగాణ ఉద్యమం తర్వాతే సీఎం ఒక ప్రాంతం వారుంటే... మరో ప్రాంతానికి డిప్యూటీ సీఎం పదవినివ్వాలనే ఫార్ములాను పునరుద్ధరించారు. ముల్కీ నిబంధనల మూలంగా కోస్తాంధ్ర వాసులు హైదరాబాద్‌లో ఉద్యోగాలు పొందడం గగనమైపోయింది. వారిలో అసంతృప్తి రాజుకుంది. సొంత రాష్ట్రంలో, అదీ రాజధానిలో తమకు అవకాశాల్లేకపోవడమేమిటని భావించారు. ముల్కీ నిబంధనలను హైకోర్టులో సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ముల్కీ నిబంధనలు వర్తించవని 1972 ఫిబ్రవరి 14న 4-1 మెజారిటీతో హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా ముల్కీ నిబంధనల అమలుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. స్వరాష్ట్రంలో ద్వితీయశ్రేణి పౌరులుగా ఉండడం కంటే తెలంగాణతో సంబంధాలు తెంచుకోవడమే మంచిదనే ఆలోచనతో ‘జై ఆంధ్ర’ ఉద్యమం మొదలైంది. జనవరి 1973లో రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను విధించారు. ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో ఆరు సూత్రాల పథకం రూపొందింది. తెలంగాణ రీజినల్ కమిటీ రద్దయింది. రాష్టస్థ్రాయి ప్రణాళిక బోర్డు, మూడు ప్రాంతాలకు మూడు అభివృద్ధి మండళ్లు వచ్చాయి.

ఆరు సూత్రాల అమలుతో శాంతి నెలకొన్నా, స్థిరమైన అభివృద్ధి నమోదైనా... ప్రభుత్వోద్యోగాల్లో తమ వాటాపై తెలంగాణ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అనుమానాలు మాత్రం తొలగలేదు. వారి విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ ఎన్‌జీవోలతో విస్తృతంగా చర్చించి 610 జీవోను విడుదల చేసింది. ‘‘18.10.1975 తర్వాత ఆరు సూత్రాల ఫార్ములాలోని జోనల్ నిబంధనలకు విరుద్ధంగా జోన్- 5, జోన్-6 (తెలంగాణ జోన్‌లు) కేటాయించిన ఉద్యోగులందరినీ అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి 31-03-1986లోగా వెనక్కి పంపాలన్నది జీవో సారాంశం. అయినా లోపాలను సరిదిద్దాలని విజ్ఞాపనలు వస్తుండటంతో ప్రభుత్వం గిర్‌గ్లానీ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ 30-09-2004న నివేదికను ఇచ్చింది. 35 దిద్దుబాటు చర్యలను సిఫారసు చేసింది. మంత్రుల బృందాన్ని నియమించిన ప్రభుత్వం 10.08.2006న గిర్‌గ్లానీ నివేదికను ఆమోదించినా జీవో అమలులో తీవ్ర జాప్యం జరిగిందని తెలంగాణ ఉద్యోగులు ఇప్పటికీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తెలంగాణ ఉద్యమానికి అవసరమైన సైద్ధాంతిక, నిర్మాణ మద్దతును టీఆర్‌ఎస్ అందివ్వగలిగింది. ఉద్యమాన్ని నిలబెట్టింది. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఎన్నికల ద్వారా తమ ప్రాముఖ్యతను చాటడానికి ప్రయత్నించింది. 2004 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, 2009లో టీడీపీలు టిఆర్‌ఎస్‌తో జట్టు కట్టడం గమనార్హం. 2009 మే నుంచి నవంబరు దాకా ప్రత్యేకంగా చెప్పుకోదగిన సంఘటనలేవి (తెలంగాణకు సంబంధించి) జరగలేదు. తెలంగాణ తెచ్చుకునే క్రమంలో భారీ కార్యాచరణను రూపొందించుకుంటున్నామని, తాను నవంబరు చివరి వారంలో ఆమరణ నిరాహారదీక్షకు దిగుతున్నానని కేసీఆర్ ప్రకటించారు’’ అని తెలిపింది.

శ్రీకృష్ణ సందేశం - 2

అంత వీజీ కాదు!..అయినా..

శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఉపోద్ఘాతం...
అప్పజెప్పిన పని సులభమైనది కాదు.. ఇందుకోసం విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధన జరిపాం

శ్రీకృష్ణ సందేశం - 1

ఆఖరుదే అత్యుత్తమం...
6 ప్రతిపాదనలు చేసిన శ్రీకృష్ణ కమిటీ

శ్రీకృష్ణ కమిటీలో మొత్తం 9 అధ్యాయాలు... అవి..

1. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. చరిత్ర ప్రస్తావన.
2. ప్రాంతీయ, ఆర్థిక అంశాలు. సమతుల్యత విశ్లేషణ
3. విద్య, వైద్యం 4. నీటి వనరులు, ప్రాజెక్టులు
5. ప్రజలు, ప్రభుత్వ రంగ ఉపాధి 6. హైదరాబాద్ సంబంధ అంశాలు
7. సామాజిక, సాంస్కృతిక అంశాలు
8. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, నక్సల్స్ సమస్యలు
9. భవిష్యత్తు సూచనలు

Thursday, January 6, 2011

శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తి పాఠం

శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తి పాఠం  ఈ క్రింది లింక్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

http://mha.nic.in/pdfs/CCSAP-Appendix-060111.pdf

http://mha.nic.in/pdfs/CCSAP-REPORT-060111.pdf

Wednesday, January 5, 2011

శ్రీకృష్ణ కమిటీ 5 సూచనలు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలపై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ప్రధానంగా 5 సూచనలను తన నివేదికలో పొందుపర్చింది.
సూచన 1 : రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచి తెలంగాణ కోసం మూడు ప్రత్యేక బోర్డుల ఏర్పాటు. తెలంగాణ కోసం నీటిపారుదల, విద్య, సాధారణ అభివృద్ధికి ప్రత్యేక బోర్డులు
సూచన 2 : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విభజన (1956 ముందు పరిస్థితి పునరుద్ధరణ)
సూచన 3 : హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డిలతో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌
సూచన 4: తెలంగాణ, రాయలసీమ కలిపి ఒకటిగా, కోస్తాంధ్ర ప్రాంతం ఒకటిగా రాష్ట్ర విభజన.
సూచన 5 : రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించడం
--------------
మొదటి సంపుటిలో 9 అధ్యాయాలు
 1960 అక్టోబర్ 3వ తేదీన ఐరాసలో పండిత్ జవహర్ లాల్ నెహ్రు ప్రసంగించిన బుద్ధుని ప్రవచనాలతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ప్రారంభించింది. ఈ నివేదికలోని మొదటి సంపుటిలో 9 అధ్యాయాలతో కూడిన 505 పేజీలు ఉన్నాయి.

1వ అధ్యాయం : రాష్ట్రంలో పరిణామాలు, చారిత్రక దృక్పధం
2వ అధ్యాయం : ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి - సమతౌల్యత విశ్లేషణ
3వ అధ్యాయం : విద్య-వైద్యం
4వ అధ్యాయం : నీటి వనరులు, సాగునీటి అభివృద్ధి, విద్యుత్
5వ అధ్యాయం : ప్రజలు - ఉద్యోగిత అంశాలు
6వ అధ్యాయం : హైదరాబాద్ మహా నగరం
7వ అధ్యాయం : సామాజిక, సాంస్కృతిక అంశాలు
8వ అధ్యాయం : శాంతి భద్రతలు అంతర్గత సమస్య
9వ అధ్యాయం : భవిష్యత్‌పై సూచనలు