....

Footer Right Content

Thursday, May 27, 2010

తెలుగుతేజం జిలుగులు

ఐఐటీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విజయభేరి మోగించింది. జాతీయ స్థాయిలో సార్వత్రిక విభాగంలో మొదటి ర్యాంకుతోపాటు మొదటి 10 ర్యాంకుల్లో ఏడు మనకే దక్కాయి. వికలాంగుల, ఓబీసీ విభాగాల్లోనూ జాతీయ మొదటి ర్యాంకులను మన రాష్ట్రమే సొంతం చేసుకుంది. మొత్తం 1500మంది దాకా మన రాష్ట్రం నుంచి ఐఐటీల్లో సీట్లు పొందే అవకాశముందని అంటున్నారు. సార్వత్రిక విభాగంలో వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన అనుముల జితేందర్‌రెడ్డి జాతీయ స్థాయిలో

Sunday, May 23, 2010

మూగబోయిన మానసవీణ

తెలుగు ప్రజలను 38ఏళ్ల పాటు అలరించిన మానసవీణ మూగబోయింది. 'మానసవీణ మధుగీతం...' అంటూ ఉర్రూతలూగించిన ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి హైదరాబాద్‌లో శనివారం రాత్రి తొమ్మిది గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. వేటూరికి భార్య సీతామహాలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన వూపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. మూడు రోజుల కిందట గ్యాస్ట్రిక్‌ సమస్య అంటూ ఏషియన్‌ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి ఇతర సమస్యలున్నాయని చెప్పడంతో శుక్రవారం రాత్రి కేర్‌ ఆసుపత్రిలో చేరారు. వూపిరితిత్తుల్లో తీవ్రంగా రక్తస్రావం జరగడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు.

వేటూరి స్వస్థలం కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి. ప్రముఖ కవి వేటూరి ప్రభాకరశాస్త్రి సోదరుడి కుమారుడు సుందరరామమూర్తి. 1950లో ఆయన మద్రాసు గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కళాశాలలో

Monday, May 3, 2010

ఎలర్జీ పోగొట్టే ఉసిరి పొడి

రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఎలర్జీ సులభంగా సోకుతుంది. ఫలితంగా తుమ్ములు, జలుబు వస్తాయి. ఇటువంటి ఇబ్బంది కలవారు ప్రతిరోజూ పరగడుపున ఉసిరిపొడి లేదా రసం తీసుకుంటే సమస్య దరిచేరదు. ఉదయంపూట ఐదారు తులసి ఆకులు నమిలి మింగటం కూడా మంచిదే.

ఒక స్పూన్ శొంఠి పొడి లేదా ఒక స్పూన్ అల్లం రసం తాగినా జలుబు, తుమ్ములు తగ్గుతాయి. అరగ్లాసు నీళ్లలో ఐదు తులసి ఆకులు, ఐదు లవంగాలు వేసి మరిగించి ఆపైన చల్లార్చి తాగాలి.

అరగ్లాసు నీరు, అరగ్లాసు పాలు కలిపి అందులో రెండు ఎండు ఖర్జూర పళ్లు వేసి మరిగించి అవి సగం అయ్యేవరకూ వేడి చేసి ఆపైన చల్లార్చి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇదే పద్ధతిలో దాల్చిన చెక్క వేసి మరిగించి, చల్లార్చి తాగాలి.

"లో బీపీ" ని తగ్గించే బీట్‌రూట్

శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని హైపోటెన్షన్ తగ్గిస్తుంది. దీన్నే "లో బీపీ" అంటారు. వారం రోజులపాటు ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు పచ్చి బీట్‌రూట్ రసం తాగితే రక్త ప్రసరణను క్రమబద్ధీకరించవచ్చు. దానిమ్మ రసం కూడా రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది.

అలాగే వారం రోజులపాటు తాజా పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటే బీపీ క్రమబద్ధం కావటంతోపాటు శారీరక వ్యవస్థ మొత్తం శక్తివంతం అవుతుంది. అయితే రోజుకు మూడుసార్లూ తాజా పండ్లనే తీసుకోవాలి. ఐదు గంటల వ్యవధిలో పూర్తిస్థాయి భోజనానికి సరిపడే మోతాదులో పండ్లను తినాలి.

ఆ తరువాత రెండు లేదా మూడు వారాలపాటు పండ్లతోపాటు పాలు కూడా తీసుకోవాలి. ఆ తర్వాత పండ్లను కొంత తగ్గించి.. గింజలు, చిరుధాన్యాలు, పచ్చికూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేయటంవల్ల లో బీపీ సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఇలా మూడు నెలలకొకమారు "కోర్స్ ఫుడ్‌హ్యాబిట్"ను పాటిస్తుంటే ఆరోగ్యానికి కూడా మంచిది.

రక్తపోటును తగ్గించేందుకు మంచి మందు...ఎర్రగా నిగనిగలాడే టొమోటోలు

ఎర్రగా నిగనిగలాడే టొమోటోలలోంచి తీసిన పదార్థం రక్తపోటును తగ్గించేందుకు మంచి మందుగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలద్వారా తెలుస్తోంది. విటమిన్లు, మినరల్స్ లాంటి సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా కలిగి ఉన్న టొమోటోలు.. రక్తాన్ని వృద్ధి చేసేందుకు మాత్రమే కాకుండా, రక్తపోటును తగ్గించటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

హైపర్ టెన్షన్‌ వ్యాధితో బాధపడుతున్న పలువురు రోగులపై జరిపిన ఓ అధ్యయనంలో.. టొమోటోలలోని లైకోపీన్ నుంచి తయారు చేసిన లైకోమాటో అనే సప్లిమెంట్లు రక్తపోటు నివారణకు అద్భుతమైన మందుగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా సిస్టోలిక్ ప్రెషర్ 120-140 లోపు, డయాస్టోలిక్ ప్రెషర్ 80-90 లోపు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే హైపర్ టెన్షన్‌ ఉన్నట్లుగా పరిగణించాల్సి ఉంటుంది.

అయితే లైకోపీన్‌ నుంచి తయారు చేసిన లైకోమాటో హైపర్‌ టెన్షన్‌తో బాధపడే రోగులకు ఇవ్వగానే వారిలో సిస్టోలిక్ ప్రెషర్ 10 పాయింట్లు, డయాస్టోలిక్ ప్రెషర్ 4 పాయింట్ల మేరకు తగ్గినట్లు పరిశోధకులు గమనించారు.

ఇదిలా ఉంటే.. టొమోటోలలో ఎన్నో రకాల పోషకాలున్నప్పటికీ.. లైకోపీన్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయటమే గాకుండా.. గుండెకు చేటు చేసే ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా కూడా నిరోధిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గతంలో ఎన్నో పరిశోధనలు పై విషయాలను నిర్ధారించినా, ఇప్పుడు తాజాగా టొమోటోల్లోని ఈ లైకోపీన్‌కు రక్తపోటును కూడా తగ్గించే గుణం ఉన్నట్లు తేటతెల్లమైంది. కాబట్టి.. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలుచేసే ఎర్రాని టొమోటోపండ్లను ఎంచక్కా లాగింసి.. బీపీని అదుపులో పెట్టుకుంటారు కదూ..?!

జలుబును, షుగర్ తగ్గించే "జామ"

మనలో చాలామంది జామపళ్లను తింటే త్వరగా జీర్ణం కావని, జలుబు చేస్తుందని చెబుతుంటారు. అయితే అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. జామపండ్లలో పీచు పదార్థం అధికంగా ఉండటంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిలో ఉండే పీచు పదార్థం అరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది.

జామపండు పై తొక్కలో సీ విటమిన్ అధికంగా ఉంటుంది. అదే విధంగా ఇందులో ఏ, బీ విటమిన్‌లు అధిక మొత్తంలో లభిస్తాయి. సాధారణంగా జామపండులోకంటే దోర కాయల్లోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని పలువురు వైద్యుల అభిప్రాయం. అదే విధంగా జామ ఆకులను చిగుళ్లవాపుకు మందులా కొంతమంది వాడుతుంటారు.

కాగా.. మైర్టసీన్ జాతికి చెందిన జామఫలం భూమధ్యరేఖా ప్రాంతాలలో ఎక్కువగా పండుతుంది. మెక్సికో, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల నుంచి మనవైపు విస్తరించిన జామ ప్రస్తుతం ఆసియా ఖండం అంతగా విరివిగా పండుతోంది. వందకు పైగా జామ జాతుల రకాలు ఉన్నాయి.

నేడు పండిన జామకాయల నుంచి జామ్స్, జెల్లీస్ లాంటివి కూడా తయారు చేస్తున్నారు. జామ ఎసెన్స్‌తో ఇప్పుడు కూల్‌డ్రింకులు కూడా వస్తున్నాయి. పోషక ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం అధికమొత్తంలో లభ్యం కావటమేకాకుండా 28.55 శాతం పీచు పదార్థం లభ్యమవటంవల్ల జామకాయలను షుగర్ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా వాడవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

జామలో 1.05 శాతం మాత్రమే కొవ్వు ఉండటంవల్ల ఊబకాయులు సైతం కావాల్సినన్ని తినవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. జామ ఆకుల నుంచి తీసిన ఆయిల్‌ను యాంటీ క్యాన్సర్ మందుగా వాడుతున్నట్లు కూడా ఇటీవలి పరిశోధనల ద్వారా తెలుస్తోంది. ఆ దిశగా ఇంకా పరిశోధనలు ముమ్మరం అయ్యాయి.

అదే విధంగా జామ ఆకులు రోగనిరోధక శక్తిగా కూడా ఉపయోగపడుతున్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ దిశగా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. సో.. ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న జామను చవక పండే కదా అని అశ్రద్ధ చేయకుండా.. చిలక్కొట్టిన జామ రుచిని ఆస్వాదిస్తారు కదూ...!!

క్యాన్సర్ నిరోధానికి పసుపు

కూరల మీద చిటికెడు పసుపు చల్లి వంట చేయడం భారతీయులకు అలవాటు. ఆ పసుపు వల్ల కూరలకు ఒక ప్రత్యేకమైన రంగు వస్తుంది. అయితే పసుపుకు ఉన్నటువంటి ఈ రంగు వల్ల లాభం ఉండదు... ఆ పసుపు ఉడికించేటపుడు వెలువడే ఒక రకమైన రసాయనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఈ రసాయనం వల్ల మానవ శరీరంలో క్యాన్సర్ నిరోధించబడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కుర్కుమిన్ అనే రసాయనం ట్యూమర్‌గా మారబోతున్న క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది.

పసుపు చల్లిన కూరలు తినిపించటం ద్వారా బ్రిటన్‌లో కొందరిమీద పరిశోధనలు చేశారు. పసుపు చల్లిన కూరలను తినడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు తేల్చారు.

గుండెజబ్బుల బారినుంచి కాపాడే వేరుశెనగ

కందిపప్పుకు సులువైన ప్రత్యామ్నాయంగా అందరిచేతా వహ్వా అనిపించుకున్న వేరుశెనగవల్ల వంటకాలకు రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. మాంసాహారంలో లభించే మాంసకృత్తులన్నీ అంతే మోతాదులో లభించే ఈ వేరుశెనగ.. గుడ్డుకంటే రెండున్నర రెట్ల మాంసకృత్తులను అధికంగా అందిస్తుంది.

వేరుశెనగలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులతో పాటు.. క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, జింక్, బోరాన్‌లలు పుష్కళంగా లభిస్తాయి. అంతేగాకుండా వీటిని ఆహారంగా తీసుకోవటంవల్ల విటమిన్‌-ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి. అయితే ఇందులో కొవ్వుశాతం కాస్త ఎక్కువ కాబట్టి కెలొరీలూ అంతే స్థాయిలో ఉంటాయని అర్థం చేసుకోవాలి.

పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తుల పాత్ర అత్యంత కీలకం. అందుకే పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉండే పిల్లలకు వేరుశెనగను మించి ఔషధం లేదు. అదే విధంగా గర్భిణులకు, పాలిచ్చే తల్లులకూ మాంసకృత్తులు వీటినుంచి సమృద్ధిగా లభిస్తాయి. వేరుశెనగతో రోగ నిరోధక శక్తి పటిష్టం అవుతుంది.

వేరుశెనగలో ఉండే రెస్వెరప్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వార్ధక్యపు ఛాయలనూ దరిచేరనివ్వదు. గుండెజబ్బుల్ని నివారించే కొన్నిరకాల మందుల్లో వేరుశెనగ సుగుణాలుంటాయి. శరీరానికి మంచి చేసే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ 50 శాతం మేరకు కలిగి ఉండే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్ ముప్పు తొలగుతుంది, అంతేగాకుండా కొలస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.

బరువు తగ్గేందుకు, ఆర్థరైటిస్ నివారణలో సైతం వేరుశెనగ పప్పు చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది. ఇది పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించేందుకు తోడ్పడుతుంది. వీటిలో సుమారు 70 శాతం శాచురేటెడ్‌, 15 శాతం పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉన్నప్పటికీ మోనోఫ్యాట్స్‌ వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఈ పప్పులోని ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. పప్పుతోపాటు వేరుశెనగ నూనె కూడా మంచిదే. అయితే ఇందులో కేవలం ‘ఇ’ విటమిన్‌ మాత్రమే ఉంటుంది.

ఎలా వాడాలంటే... ప్రతి రోజూ సుమారు 25 గ్రాముల వేరుశెనగపప్పును ఏదో ఒక రూపంలో పిల్లలకు అందివ్వచ్చు. వీటిలో కొవ్వుశాతం కాస్త ఎక్కువ కాబట్టి, మోతాదు మించి తీసుకోకూడదు. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ తీసుకోవాల్సిన కెలోరీల్లో కొన్నింటిని మానేసి బదులుగా మాత్రమే వేరుశెనగను ఎంచుకోవాలి. లేదంటే చిన్న చిన్న సమస్యలు తప్పవు. అయితే.. కొంతమందికి వేరుశెనగ పడదు. దీన్ని తిన్నవెంటనే ఎలర్జీ వస్తుంది. అలాంటివారు వెంటనే మానేయడం మేలు. పప్పు మాత్రమే కాకుండా, ఇలాంటివారు వేరుశెనగ నూనె కూడా వాడకపోవటం ఉత్తమం.

అన్ని రకాల ఎలర్జీలకు "రసం"తో చెక్

* ఆయాసం, తలనొప్పి, తుమ్ములు, జలుబు, ఊపిరితిత్తుల్లో నెమ్ము.. లాంటి అనేక రకాల ఎలర్జీలతో తరచూ సతమతం అయ్యేవారు క్రమం తప్పకుండా "రసం" తాగుతుంటే వాటికి చెక్ పెట్టవచ్చు. రసం తయారీలో వినియోగించే ధనియాలు, మిరియాలు, జీలకర్ర.. తదితర పదార్థాలు ఆయా ఎలర్జీల లక్షణాలను తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

* రక్తక్షీణతతో ఇబ్బందిపడేవారు.. నల్లమచ్చలు, దురదలు, దద్దుర్లు మొదలైన అనేక చర్మవ్యాధులతో బాధపడేవారు, సి విటమిన్ శరీరంలో తక్కువగా ఉన్నవారు, ముఖ్యంగా పళ్ల చిగుళ్లనుంచి రక్తం కారే స్కర్వీ వ్యాధి ఉన్నవారూ... చింతపండుకు బదులుగా నిమ్మరసంగానీ, టొమోటోలుకానీ కలిపి తయారు చేసిన రసం తాగితే చాలా మంచిది.

* కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, పక్షవాతం, ఇతర వ్యాధులన్నింటితో బాధపడేవారు పాత చింతపండుతో కాచిన రసం తాగటం శ్రేయస్కరం. ఇది పేగుల్లోపలి దోషాలను కడిగేసి, చక్కగా విరేచనం అయ్యేలా చేసి బాధలను తగ్గిస్తుంది. అదే విధంగా పలురకాల వాత వ్యాధులతో ఇబ్బందిపడేవారు కూడా ఆహారంలో విధిగా రసం వాడటం అవసరం. చింతపండు సరిపడనివారు నిమ్మ, దానిమ్మ రసాలను రసం చేసుకోవచ్చు.

* సునాముఖి ఆకుతో చారు చేసుకుని తాగితే ఇంకా మంచిది. రసం తయారు చేస్తున్నప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే.. నిమ్మ, దానిమ్మ, టమోటా వగైరా పళ్లను చారులో కలిపేప్పుడు చారు కాగిన తరువాత దింపే సమయంలో వీటి రసాలను కలపాలి. అలాకాకుండా ఈ పళ్ల రసాలను కూడా చారుతోపాటు ఉడకిస్తే, అందులో సీ విటమిన్‌ చాల తేలికగా ఆవిరైపోయి, సారం లేని చారు మాత్రమే మిగులుతుంది కాబట్టి అలా చేయకూడదు.

పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచే పుచ్చకాయ

* వేసవి తాపాన్ని తగ్గించే పుచ్చకాయ (తర్భూజా)లో ఉండే లైకోపీన్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుందని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతేగాకుండా ఈ లైకోపీన్ వీర్యకణాలు ఎక్కువసేపు సజీవంగా ఉండేలా కూడా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

* పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి సంఖ్యాపరంగా చూస్తే శీతాకాలంలో ఎక్కువగా ఉంటుందనీ, వేసవిలో తక్కువగా ఉంటుందనేది చాలా మందికి తెలిసిన విషయం. అయితే ఈ కాలంలో దాంపత్య కార్యకలాపాలలో పాల్గొన్నప్పటికీ పిల్లలు పుట్టని దంపతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, మహిళలు తమ భాగస్వామిని ఎక్కువగా పుచ్చకాయ తినేలా చేస్తే సరిపోతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

* మామూలుగా పుచ్చకాయలో 92 శాతం నీళ్లే ఉంటాయి. అందులోని 8 శాతం లైకోపీన్ మాత్రం వీర్యవృద్ధిని పెంచటమేగాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో సులక్షణాలను కలిగి ఉంది. లైకోపీన్ అనబడే ఈ ఫైటో కెమికల్ గుండె, ప్రొస్టేట్, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే ఓవరియన్, సర్వికల్, నోటి సంబంధిత క్యాన్సర్లనుంచి కూడా రక్షణనిస్తుంది. ఇంకా పుచ్చకాయ వేసవినుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాలిన గాయాలమీద చల్లని పుచ్చకాయ ముక్కల్ని ఉంచితే ఉపశమనం కలుగుతుంది.

నోటి పూత సమస్యను అధిగమించాలంటే...

కొందరు తరచూ నోటి పూత సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు సరిగా ఆహారం తీసుకోలేరు. సరిగా మాట్లాడలేరు. దీనికి ప్రధాన కారణం వారు తీసుకునే ఆహారంలో మార్పులు చోటుచేసుకోవడమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు శరీరంలో విటమిన్ల లోపం, మానసికపరమైన ఒత్తిడి, నిద్రలేమి, కాఫీ, టీలు ఎక్కువగా సేవిస్తుండటంతో ఈ సమస్య ఉత్పన్నమౌతుంది.

నోటి పూత సమస్యను అధిగమించాలంటే ప్రతి రోజు ఉదయం పరకడుపున ఉప్పు కలపిన నీటిని నోట్లో వేసుకుని పుక్కలించండి. నల్ల నువ్వులను దంచి ఉండలా చేసుకుని నోట్లో పెట్టుకుని రసం పీల్చి పిప్పిని ఉమ్మేయండి.

బియ్యం కడిగిన నీటిలో చెంచా ఉసిరి రసం కలుపుకుని భోజనానికి ముందు సేవించండి. దీంతో మంచి ఫలితముంటుందంటున్నారు వైద్యులు.

శరీరానికి తక్షణ శక్తినిచ్చే పుచ్చకాయ

ఎరుపురంగుతో అలరించే "పుచ్చకాయ" వేసవిలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేసవిలో అధిక వేడినుంచి, వడదెబ్బనుంచి కాపాడే పుచ్చకాయలోని పొటాషియం గుండెకు చాలా మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడిన వారు దీనిని తినట్లయితే శరీరం నిస్తేజం అవకుండా కాపాడుతుంది. పుచ్చలో లభించే బి విటమిన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

పుచ్చకాయలో 92 శాతం మేరకు నీరే ఉంటుంది. అది శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, మూత్రనాళాలలో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ ఒక ఔషధం లాంటిదనే చెప్పవచ్చు. ఇంకా రక్తపోటుతో బాధపడేవారు పుచ్చకాయను తీసుకోవటం మంచిది. ఈ కాయలోని పొటాషియం, మెగ్నీషియంలో రక్తపోటును అదుపులో ఉంచేందుకు తోడ్పడుతాయి.

ఈ కాయలో శక్తి, కెలోరీలు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేటులు, కొవ్వు, పీచు పదార్థాలు, సోడియం, పొటాషియం.. లాంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు అధికంగా ఉండే పుచ్చ.. హానికారక ఫ్రీరాడికల్స్‌ను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఇందులో ఎక్కువగా లభించే బీ విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో తోడ్పడుతుంది. ఇన్‌ఫెక్షను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

అయితే వేసవిలో ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లో దొరికే పుచ్చకాయలను ఏవి పడితే అవి కొనేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మంచి ఆకుపచ్చని రంగులో ఉండే వాటినే ఎంచుకోవాలి. కాయపై వేలితో కొడితే బోలు శబ్దం వచ్చినప్పుడే కొనాలి. అలా బోలు శబ్దం వచ్చినట్లయితే అది బాగా పండినదని అర్థం చేసుకోవాలి. అలాగే తేలికగా ఉండేదాన్ని కాకుండా బాగా బరువుగా ఉన్న కాయను ఎంపిక చేసుకోవాలి.

ముఖ్యంగా ఈ కాయలను కాయలుగా ఉన్నప్పుడే కొనాలి. కోసి ముక్కలు చేసి అమ్మేవాటికి దూరంగా ఉండాలి. ఎండలో వడదెబ్బనుంచి కాపాడటమేకాకుండా.. ఆస్తమా, చక్కెర వ్యాధి, కీళ్ల నొప్పుల్లాంటి వ్యాధులకు కారకమయ్యే పరిస్థితులను సైతం పుచ్చకాయ నివారిస్తుంది. కాబట్టి.. పచ్చ పచ్చాని పుచ్చకాయల్ని ఓ పట్టు పట్టేద్దామా..?!

బీట్‌రూట్‌తో అధిక ఒత్తిడికి గుడ్‌బై

నోరూరించే ముదురు ఎరుపు రంగుతో ఉండే బీట్‌రూట్‌తో అధిక ఒత్తిడికి గుడ్‌బై చెప్పవచ్చు. విపరీతమైన పనివేళలతో సతమతమవుతూ అధిక ఒత్తిడికి గురయ్యేవారు, రోజుకు రెండు కప్పుల బీట్‌రూట్ రసం గనుక తీసుకున్నట్లయితే ఈ సమస్యను అధిగమించవచ్చు.

బీట్‌రూట్‌లో విటమిన్ ఏ, బీ, సీలు, క్యాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, ఫోలిక్ ఆమ్లం, బీటా కెరోటిన్, పీచు పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ దుంపలో సహజ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఆంథోసైనడిన్లు పుష్కళంగా లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి బీట్‌రూట్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు ఎర్ర రక్త కణాలను వృద్ధి చేసి, శరీరంలో రక్త శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయి.

అదే విధంగా బీట్‌రూట్‌లో లభించే పీచు పదార్థాలు రక్త కణాలపై ఉండే అధిక కొవ్వును తొలగించి, మలబద్ధకం సమస్యను అదుపులో ఉంచేందుకు సహాయకారిగా పనిచేస్తాయి. ఈ దుంపలో బిటైన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో నిల్వ ఉండే చెడు కొవ్వును కరిగించి, గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. అలాగే మూత్ర పిండాలు, కాలేయంలో పేరుకున్న మలినాలను తొలగించి, వాటి పనితీరును మెరుగుపరచటంలో బిటైన్ సమర్థవంతగా పనిచేస్తుంది.

ఇంకా ఊపిరితిత్తులు, చర్మ సంబంధ క్యాన్సర్లకు కారణమైన నైట్రోసమైన్లను బీట్‌రూట్‌లోని పోషకాలు ప్రభావవంతంగా ఎదుర్కొంటాయి. ఇందులో లభించే సహజ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. ప్రతిరోజూ వ్యాయామం, ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు పరగడుపునే ఒక గ్లాసు బీట్‌రూట్ రసం తీసుకోవాలి. ఈ రసంలో ఇనుము, క్యాల్షియం, సీ విటమిన్లు శరీరానికి శక్తినందిస్తాయి. దాంతో శరీరం అలసిపోకుండా ఉత్సాహంగా ఉంటుంది.

అధిక చెమట బారి నుండి రక్షించే "కరివేపాకు"

* అధిక చెమటతో తడిసి ముద్దయ్యేవారు పెరటి మొక్క "కరివేపాకు" ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అలాగే చెమట చెడువాసను కూడా తగ్గిస్తుంది. దీనిని వివిధ రకాల ఆహార పదార్థాలతోపాటు తీసుకోవచ్చు లేదా పొడి చేసుకుని వాడుకోవచ్చు.

* ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు చెట్టు పెరట్లో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే దీనినుంచే వీచే గాలి కూడా ఆరోగ్యకరమైనదే కాబట్టి. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట్ల కరివేపాకు చెట్లను నాటినట్లయితే గాలి శుభ్రపడుతుంది. విషప్రభావం కలిగించే వాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి.

* కరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు, పువ్వులు.. అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినట్టివే. వగరుగా ఉన్నప్పటికీ సువాసనాభరితంగా ఉన్న కరివేపాకులో ఐరన్ పుష్కళంగా లభిస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ముఖ్యంగా అనీమియా (రక్తహీనత) వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు.

* కరివేపాకు పేగులకు, కడుపుకు బలాన్ని ఇవ్వటమే కాకుండా.. శరీరానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది. అజీర్ణాన్ని అరికట్టి ఆకలి పుట్టిస్తుంది. న్యూమోనియా, ఫ్లూ.. లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో కూడా కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా మలబద్ధకంతో బాధపడేవారికి, మొలల సమస్యతో సతమతం అయ్యేవారికి కూడా కరివేపాకు దివ్యౌషధమనే చెప్పవచ్చు.

కాకరకాయతో "కామెర్ల వ్యాధి"కి చెక్..!!

* కామెర్ల వ్యాధితో బాధపడేవారు తాజాగా తీసిన కాకర రసాన్ని నీటితో కలిపి రోజుకు రెండుసార్లు సేవించినట్లయితే తగ్గుతుంది. కామెర్ల వ్యాధి సోకిన రోగి కళ్లు పచ్చగా ఉన్న సమయంలో కాకర రసాన్ని ఇవ్వాలి. కళ్లలో పచ్చదనం పోయిన తరువాత కాకర రసాన్ని ఇవ్వటం ఆపివేస్తే సరిపోతుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా, దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడేశక్తి కాకరకు మెండుగా ఉంది.

* కీళ్ల నొప్పులను తగ్గించే గుణం కూడా కాకరలో పుష్కళంగా ఉంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు కాకర రసాన్ని రాసి, నెమ్మదిగా మర్దనా చేస్తే నొప్పి క్రమంగా తగ్గుతుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు రోజుకు రెండుసార్లు మూడు నెలలపాటు క్రమం తప్పకుండా కాకర రసం తాగినట్లయితే తగ్గుముఖం పడుతుంది. కాకరను ఆహారంలో భాగంగా తీసుకున్నా ఒంట్లో చక్కెర స్థాయి మారుతుంది.

* కడుపులో నులిపురుగులను అరికట్టటంలో కూడా కాకర రసం అద్భుతంగా పనిచేస్తుంది. నులి పురుగులకు చెక్ పెట్టాలంటే రోజుకు ఒక టీస్పూన్ తీసుకుంటే సరిపోతుంది. మలబద్ధకాన్ని వదిలించటంలో కూడా కాకర ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతిరోజూ రెండుసార్లు అర టీస్పూన్ చొప్పున కాకర రసం తీసుకోవాల్సి ఉంటుంది.

* ఇక చివరగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. కాకరను గర్బిణీ స్త్రీలు తీసుకోకూడదు. ఇలాంటి సమయంలో కాకర చేదు మంచిది కాదు. ఇకపోతే.. పండిన కాకరకాయలను ఎవ్వరూ తినకపోవటమే శ్రేయస్కరం. ఆరోగ్యానికి చాలారకాలుగా మేలుచేస్తుంది కదా అని కాకరకాయని విపరీతంగా ఆహారంలో తీసుకోకూడదు. ఎందుకంటే దీనికి వేడి చేసే గుణం ఎక్కువ కాబట్టి.. దానివల్ల వేరే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త..!

క్యాన్సర్‌కు "క్యాబేజీ"తో చెక్

* కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావటం అరుదుగా సంభవిస్తుందనీ, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చునని వైద్యులు అంటున్నారు.

* క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అంతేగాకుండా.. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేనివారు కాస్త పంచదార కలుపుకుంటే సరి.

* అదే విధంగా అతిగా పొగతాగే పొగరాయుళ్లను ఆ అలవాటునుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగతాగటం మాన్పించటం కాదుగానీ.. పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందేనని వైద్యుల సూచన.