* ఆయాసం, తలనొప్పి, తుమ్ములు, జలుబు, ఊపిరితిత్తుల్లో నెమ్ము.. లాంటి అనేక రకాల ఎలర్జీలతో తరచూ సతమతం అయ్యేవారు క్రమం తప్పకుండా "రసం" తాగుతుంటే వాటికి చెక్ పెట్టవచ్చు. రసం తయారీలో వినియోగించే ధనియాలు, మిరియాలు, జీలకర్ర.. తదితర పదార్థాలు ఆయా ఎలర్జీల లక్షణాలను తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
* రక్తక్షీణతతో ఇబ్బందిపడేవారు.. నల్లమచ్చలు, దురదలు, దద్దుర్లు మొదలైన అనేక చర్మవ్యాధులతో బాధపడేవారు, సి విటమిన్ శరీరంలో తక్కువగా ఉన్నవారు, ముఖ్యంగా పళ్ల చిగుళ్లనుంచి రక్తం కారే స్కర్వీ వ్యాధి ఉన్నవారూ... చింతపండుకు బదులుగా నిమ్మరసంగానీ, టొమోటోలుకానీ కలిపి తయారు చేసిన రసం తాగితే చాలా మంచిది.
* కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, పక్షవాతం, ఇతర వ్యాధులన్నింటితో బాధపడేవారు పాత చింతపండుతో కాచిన రసం తాగటం శ్రేయస్కరం. ఇది పేగుల్లోపలి దోషాలను కడిగేసి, చక్కగా విరేచనం అయ్యేలా చేసి బాధలను తగ్గిస్తుంది. అదే విధంగా పలురకాల వాత వ్యాధులతో ఇబ్బందిపడేవారు కూడా ఆహారంలో విధిగా రసం వాడటం అవసరం. చింతపండు సరిపడనివారు నిమ్మ, దానిమ్మ రసాలను రసం చేసుకోవచ్చు.
* సునాముఖి ఆకుతో చారు చేసుకుని తాగితే ఇంకా మంచిది. రసం తయారు చేస్తున్నప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే.. నిమ్మ, దానిమ్మ, టమోటా వగైరా పళ్లను చారులో కలిపేప్పుడు చారు కాగిన తరువాత దింపే సమయంలో వీటి రసాలను కలపాలి. అలాకాకుండా ఈ పళ్ల రసాలను కూడా చారుతోపాటు ఉడకిస్తే, అందులో సీ విటమిన్ చాల తేలికగా ఆవిరైపోయి, సారం లేని చారు మాత్రమే మిగులుతుంది కాబట్టి అలా చేయకూడదు.
No comments:
Post a Comment