శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని హైపోటెన్షన్ తగ్గిస్తుంది. దీన్నే "లో బీపీ" అంటారు. వారం రోజులపాటు ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు పచ్చి బీట్‌రూట్ రసం తాగితే రక్త ప్రసరణను క్రమబద్ధీకరించవచ్చు. దానిమ్మ రసం కూడా రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది.
అలాగే వారం రోజులపాటు తాజా పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటే బీపీ క్రమబద్ధం కావటంతోపాటు శారీరక వ్యవస్థ మొత్తం శక్తివంతం అవుతుంది. అయితే రోజుకు మూడుసార్లూ తాజా పండ్లనే తీసుకోవాలి. ఐదు గంటల వ్యవధిలో పూర్తిస్థాయి భోజనానికి సరిపడే మోతాదులో పండ్లను తినాలి.
ఆ తరువాత రెండు లేదా మూడు వారాలపాటు పండ్లతోపాటు పాలు కూడా తీసుకోవాలి. ఆ తర్వాత పండ్లను కొంత తగ్గించి.. గింజలు, చిరుధాన్యాలు, పచ్చికూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేయటంవల్ల లో బీపీ సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఇలా మూడు నెలలకొకమారు "కోర్స్ ఫుడ్‌హ్యాబిట్"ను పాటిస్తుంటే ఆరోగ్యానికి కూడా మంచిది.
No comments:
Post a Comment