....

Footer Right Content

Monday, May 3, 2010

అధిక చెమట బారి నుండి రక్షించే "కరివేపాకు"

* అధిక చెమటతో తడిసి ముద్దయ్యేవారు పెరటి మొక్క "కరివేపాకు" ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అలాగే చెమట చెడువాసను కూడా తగ్గిస్తుంది. దీనిని వివిధ రకాల ఆహార పదార్థాలతోపాటు తీసుకోవచ్చు లేదా పొడి చేసుకుని వాడుకోవచ్చు.

* ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు చెట్టు పెరట్లో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే దీనినుంచే వీచే గాలి కూడా ఆరోగ్యకరమైనదే కాబట్టి. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట్ల కరివేపాకు చెట్లను నాటినట్లయితే గాలి శుభ్రపడుతుంది. విషప్రభావం కలిగించే వాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి.

* కరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు, పువ్వులు.. అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినట్టివే. వగరుగా ఉన్నప్పటికీ సువాసనాభరితంగా ఉన్న కరివేపాకులో ఐరన్ పుష్కళంగా లభిస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ముఖ్యంగా అనీమియా (రక్తహీనత) వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు.

* కరివేపాకు పేగులకు, కడుపుకు బలాన్ని ఇవ్వటమే కాకుండా.. శరీరానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది. అజీర్ణాన్ని అరికట్టి ఆకలి పుట్టిస్తుంది. న్యూమోనియా, ఫ్లూ.. లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో కూడా కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా మలబద్ధకంతో బాధపడేవారికి, మొలల సమస్యతో సతమతం అయ్యేవారికి కూడా కరివేపాకు దివ్యౌషధమనే చెప్పవచ్చు.

No comments:

Post a Comment