....

Footer Right Content

Monday, May 3, 2010

రక్తపోటును తగ్గించేందుకు మంచి మందు...ఎర్రగా నిగనిగలాడే టొమోటోలు

ఎర్రగా నిగనిగలాడే టొమోటోలలోంచి తీసిన పదార్థం రక్తపోటును తగ్గించేందుకు మంచి మందుగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలద్వారా తెలుస్తోంది. విటమిన్లు, మినరల్స్ లాంటి సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా కలిగి ఉన్న టొమోటోలు.. రక్తాన్ని వృద్ధి చేసేందుకు మాత్రమే కాకుండా, రక్తపోటును తగ్గించటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

హైపర్ టెన్షన్‌ వ్యాధితో బాధపడుతున్న పలువురు రోగులపై జరిపిన ఓ అధ్యయనంలో.. టొమోటోలలోని లైకోపీన్ నుంచి తయారు చేసిన లైకోమాటో అనే సప్లిమెంట్లు రక్తపోటు నివారణకు అద్భుతమైన మందుగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా సిస్టోలిక్ ప్రెషర్ 120-140 లోపు, డయాస్టోలిక్ ప్రెషర్ 80-90 లోపు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే హైపర్ టెన్షన్‌ ఉన్నట్లుగా పరిగణించాల్సి ఉంటుంది.

అయితే లైకోపీన్‌ నుంచి తయారు చేసిన లైకోమాటో హైపర్‌ టెన్షన్‌తో బాధపడే రోగులకు ఇవ్వగానే వారిలో సిస్టోలిక్ ప్రెషర్ 10 పాయింట్లు, డయాస్టోలిక్ ప్రెషర్ 4 పాయింట్ల మేరకు తగ్గినట్లు పరిశోధకులు గమనించారు.

ఇదిలా ఉంటే.. టొమోటోలలో ఎన్నో రకాల పోషకాలున్నప్పటికీ.. లైకోపీన్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయటమే గాకుండా.. గుండెకు చేటు చేసే ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా కూడా నిరోధిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గతంలో ఎన్నో పరిశోధనలు పై విషయాలను నిర్ధారించినా, ఇప్పుడు తాజాగా టొమోటోల్లోని ఈ లైకోపీన్‌కు రక్తపోటును కూడా తగ్గించే గుణం ఉన్నట్లు తేటతెల్లమైంది. కాబట్టి.. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలుచేసే ఎర్రాని టొమోటోపండ్లను ఎంచక్కా లాగింసి.. బీపీని అదుపులో పెట్టుకుంటారు కదూ..?!

No comments:

Post a Comment