....

Footer Right Content

Monday, May 3, 2010

కాకరకాయతో "కామెర్ల వ్యాధి"కి చెక్..!!

* కామెర్ల వ్యాధితో బాధపడేవారు తాజాగా తీసిన కాకర రసాన్ని నీటితో కలిపి రోజుకు రెండుసార్లు సేవించినట్లయితే తగ్గుతుంది. కామెర్ల వ్యాధి సోకిన రోగి కళ్లు పచ్చగా ఉన్న సమయంలో కాకర రసాన్ని ఇవ్వాలి. కళ్లలో పచ్చదనం పోయిన తరువాత కాకర రసాన్ని ఇవ్వటం ఆపివేస్తే సరిపోతుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా, దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడేశక్తి కాకరకు మెండుగా ఉంది.

* కీళ్ల నొప్పులను తగ్గించే గుణం కూడా కాకరలో పుష్కళంగా ఉంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు కాకర రసాన్ని రాసి, నెమ్మదిగా మర్దనా చేస్తే నొప్పి క్రమంగా తగ్గుతుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు రోజుకు రెండుసార్లు మూడు నెలలపాటు క్రమం తప్పకుండా కాకర రసం తాగినట్లయితే తగ్గుముఖం పడుతుంది. కాకరను ఆహారంలో భాగంగా తీసుకున్నా ఒంట్లో చక్కెర స్థాయి మారుతుంది.

* కడుపులో నులిపురుగులను అరికట్టటంలో కూడా కాకర రసం అద్భుతంగా పనిచేస్తుంది. నులి పురుగులకు చెక్ పెట్టాలంటే రోజుకు ఒక టీస్పూన్ తీసుకుంటే సరిపోతుంది. మలబద్ధకాన్ని వదిలించటంలో కూడా కాకర ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతిరోజూ రెండుసార్లు అర టీస్పూన్ చొప్పున కాకర రసం తీసుకోవాల్సి ఉంటుంది.

* ఇక చివరగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. కాకరను గర్బిణీ స్త్రీలు తీసుకోకూడదు. ఇలాంటి సమయంలో కాకర చేదు మంచిది కాదు. ఇకపోతే.. పండిన కాకరకాయలను ఎవ్వరూ తినకపోవటమే శ్రేయస్కరం. ఆరోగ్యానికి చాలారకాలుగా మేలుచేస్తుంది కదా అని కాకరకాయని విపరీతంగా ఆహారంలో తీసుకోకూడదు. ఎందుకంటే దీనికి వేడి చేసే గుణం ఎక్కువ కాబట్టి.. దానివల్ల వేరే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త..!

No comments:

Post a Comment