....

Footer Right Content

Thursday, December 9, 2010

చేతికందాల్సిన పంటలు చేజారిపోయాయి

చేతికందాల్సిన  పంటలు చేజారిపోయాయి. సార్వాలో నాలుగుసార్లు ఏర్పడిన అల్పపీడనాలు పంట పొలాలను తుడిచి పెట్టేశాయి. లైలా తుపాను పరిహారమే ఇంతవరకూ రాలేదు. పలు జిల్లాలో నష్టం కోట్లలో  ఉంటుందని అంచనా.  అయితే అధికారిక అంచనాలు అందులో నాలుగో వంతు కూడా లేదు. వేలాది ఎకరాల్లో వరి పైర్లు దెబ్బతిన్నాయి. నాట్ల దశలోనే నాశనమైంది. కొంత పొట్టమీదున్న పైరూ నీటమునిగింది. చెరువులకింద వరి సాగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓదెలు నీటమునిగాయి.


ఇదిలావుండగా, కాకి లెక్కలతో వ్యవసాయశాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత వర్షాలకు దెబ్బతిన్న పైర్లను రైతులు పీకేశారు. అయితే ఆ నష్టం వివరాలను నేటికీ కేంద్ర ప్రభుత్వానికి నివేదించ లేదు.  నష్టపోయిన వారిలో అత్యధికులు కౌలు రైతులే అయినా వారికి సాయం చేసే అవకాశం కనిపించడం లేదు. కనీసం సబ్సిడీలైనా వీరికి దక్కడం లేదు. అన్ని విధాలా మునిగిపోతున్నారు.

1 comment:

  1. భారి వర్షాల వలనఎప్పుడూ ఎక్కువగా నష్ట పోయేది రైతులేకదండి..మంత్రులకి వారి పదవులు,డబ్బే కానీ ప్రజలు కాదుకదా.ఈ లింక్ చూడండి.http://saisatyapriya.blogspot.com/2010/12/blog-post_10.html.

    ReplyDelete