ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ‘ఏకవాక్య తీర్మానం’ పేరుతో కేంద్రం నుండి దిగుమతి కావడం లేదా వారికిష్టమైనవారిని రుద్దడం అనేది కాంగ్రెస్ సంస్కృతి అనేది జగమెరిగిన సత్యం. ఈమధ్యనే మహారాష్ట్రలో కేంద్రమంత్రిగా వున్న ఫృథ్విరాజ్ చవాన్ ను దిగుమతి చేయడం తెలిసిందే. నేడు ఆంధ్రపదేశ్లోనూ అదే తరహా వ్యూహం అయితే జరిగింది. చివరి నిమిషంలో జైపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు కానీ లేకపోతే ఇక్కడ కూడా అదే తరహా దిగుమతి జరిగేది. మరోరకమైన విధానం ఏమంటే- ఎమ్మెల్యేల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ‘ఏకవాక్య తీర్మానం’పేరుతో కాసేపు రాజకీయ డ్రామా నడిపి, ముందుగానే నిర్ణయించబడిన వ్యక్తి పేరు ప్రకటించడం ఆనవాయితీ. అదే ప్రస్తుతం జరిగింది. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్ళ గడువు వుంది. ఈలోపు మళ్ళీ ఇటువంటి కథే పునరావృతకం కాకుండా వుంటే మంచిది.
కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ గందరగోళం వల్ల రాష్ట్రంలో ప్రజాసమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యప్రజానీకం తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమబాట పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించే నాయకుడు అవసరం. ఈ సమస్యలను కొత్త నాయకుడైనా పరిష్కరించే ప్రయత్నమైనా చేస్తాడేమో చూద్దాం...
No comments:
Post a Comment