నేడు బ్రౌన్ 212వ జయంతి
సిపి బ్రౌన్ స్వతహాగా ఆంగ్లేయుడు అయినప్పటకీ తెలుగుభాషపై మక్కువతో తెలుగు ఉద్దరణకు పూనుకున్నారు. 1786 జూన్ 13న తెల్లదొరల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయానికి ఉద్యోగరీత్యా వారి తల్లిదండ్రులు మనదేశానికి వచ్చారు. రెవరెండ్ డేవిడ్ బ్రౌన్, కాలే దంపతులకు రెండో కుమారుడు సిపి బ్రౌన్. బ్రౌన్ 1798, నవంబరు 10న కోల్‌కత్తా నగరంలో జన్మించారు. సిపి బ్రౌన్ పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్‌బ్రౌన్. 1812వ సంవత్సరంలో డేవిడ్ బ్రౌన్ మృతి చెందడంతో సిపిబ్రౌన్ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో ఉంటూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817వ సంవత్సరం తన 22వ యేట సిపిబ్రౌన్ చెన్నై నగరంలో అడుగు పెట్టారు. వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద బ్రౌన్ తెలుగు అక్షరాభ్యాసం చేశారు. ఈయన వివాహం కూడా చేసుకోకుండా సరస్వతి యోగిగా నిలచిపోయారు. 1820లో కడప కలెక్టర్ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పట్లో కడప కలెక్టర్‌గా హన్‌బరీ ఉన్నారు. హింది, తెలుగు, హిందుస్థాని, కన్నడ, మరాఠీల్లో పాలనా వ్యవహారం ఉండేది. అయినప్పటికీ హన్‌బరీ తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్ అనతి కాలంలోనే తెలుగును అనర్గలంగా మాట్లాడేవారు. 1821లో రెండు పాఠశాలలు ఏర్పాటు చేశారు. పాఠశా లలో పిల్లలకు భోజనాలతో పాటు తెలుగు, హిందుస్థాన్ భాషలు నేర్పిం చారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా బదిలీపై వెళ్లారు. అక్కడ సైతం తెలుగును అభివృద్ధి చేసేందుకు రెండు పాఠశా లలు ఏర్పాటు చేశారు. అక్కడ ఉండగా అద్వైత బ్రహ్మశాస్త్రీని గురువుగా స్వీకరించారు. 1824లో వెంటకశాస్త్రీ వేమన పద్యాలకు అర్థతాత్ప ర్యాలను చెప్పారు. వాటి ఆధారంగా వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన ఘనత సిపిబ్రౌన్‌కు దక్కింది. అనంతరం 1826లో కడప రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారు మొదలైన వాటికి స్థావరం కావాలని పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు. నిఘంటువును అచ్చువేసేందుకు బోర్డుకు పంపారు. అక్కడ బోర్డు ఈ నిఘంటువును అచ్చువేయించడానికి తిరస్కరించింది. అనంతరం 1832లో బదిలీపై మచిలీపట్నం వెళ్లారు. అక్కడ ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి నిఘంటువులను అచ్చు వేయించారు. 1834లో కంపెనీ బోర్డు బ్రౌన్‌ను డిస్మిస్ చేసింది. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్రౌన్ లండన్ కోర్టు ఆఫ్ డైరెక్టర్‌కు అప్పీలు చేసి మూడు సంవత్సరాల జీతాన్ని తిరిగిపొందారు. ఉద్యోగం పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను తయారు చేసిన ఇంగ్లీష్ నిఘంటువు పుస్తకాలను అమ్ముకుని లండన్ వెళ్లి పోయారు. 1841లో చెన్నై యాక్టింగ్ పోస్టు మాస్టర్ జనరల్‌గా, తరువాత చెన్నై బోర్డు యూనివర్శిటి బోర్డు సభ్యునిగా, గ్రంథాలయ క్యూరేటర్‌గా పని చేశారు. 1846లో సొంత గ్రంథాలయం నుంచి దేశభాషలలోని 2,440 రాత ప్రతులను చెన్నై లిటరసీ సొసైటికి బహూకరించారు. తెలుగుభాషా సాహిత్యాల సముద్ధరణకు నడుంబిగించిన తెలుగు బిడ్డకు 1853లో పక్ష వాతం జబ్బు వచ్చింది. దీంతో ఆయన సెలవు పెట్టి నీలగిరి కొండలకు వెళ్లిపోయారు. 1855లో లండన్ వెళ్లిపోయారు. 1865లో యూని వర్శిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా చేరారు. అప్పట్లోనే సంస్కృతి చందస్సును అచ్చు వేయించారు. ఇంత చేసిన బ్రౌన్ ఒక భాష యొక్క సాహిత్యాన్ని ఉద్దరించడం అసాధ్యమని జీవిత చరిత్రలో రాసుకున్నారు. 1884 నవంబరు 3న వృద్ధాప్యం కారణంగా వీలునామా రాశారు. ఆంధ్రాసాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్ చిరస్మరణీయుడు. జిల్లాలో తాను నివాసం ఉన్నచోటనే బ్రౌన్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం విశేషం. 1884 డిశంబరు 12న సిపిబ్రౌన్ తుదిశ్వాస వదిలారు.
Ayya,
ReplyDeleteEee madhya nEnu London lo Brown dora gaari samadhi ni darshinchanu. kaavalante.. aayana samadhi photo pampagalanu.
Regars
Ram cheruvu - Houston
It gave me a nostalgic feeling and hair raising experience reading about him. We had a lesson on him during schooling. He is really a great person. Dear Ram cheruvu you send the pic to following email id abckiran@gmail.com
ReplyDeleteసి పి బ్రౌన్ గురించిన సమాచారం బాగుంది. వేమన శతకాలకు వారు చేసిన సేవ గురించి కూడా వ్రాయండి. ధన్యవాదాలు.
ReplyDelete