....

Footer Right Content

Saturday, August 13, 2011

తెలుగు తల్లికి వెలుగు నీరాజనం

నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభలు
విజయవాడ నగరంలో నేటి నుంచి మూడు రోజులు తెలుగు తల్లికి వెలుగు నీరాజనం! తెలుగు భాష, సాహిత్య, సంస్కృతి, పద్య, గద్య, వచన, కవిత, విమర్శ ప్రేమికులు తమ సాహితీ దాహార్తిని తీర్చుకునేందుకు ‘ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు’ వేటూరి సుందరరామమూర్తి కళా వేదికపై(తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం) నేడు అత్యంత శోభాయమానంగా ప్రారంభంకానున్నాయి. ఈ ప్రారంభ వేడుకలకు తెలుగు తల్లి పాదాలకు వెలుగు పారాణిని అద్దిన అతిరథ మహారథులు హాజరు కానుండడం విశేషం.

Thursday, August 11, 2011

తెలుగు అక్షరాలు తెలీకుండానే పట్టాలు అందుకుంటున్నారు : మండలి


వెల్లివిరియనున్న తెలుగు సౌరభం

రేపటి నుంచి విజయవాడలో  ప్రపంచ తెలుగు మహాసభలు
 
‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ.. మా కన్నతల్లికీ మంగళారతులు’ అంటూ తెలుగువారి చరిత్ర, సంస్కృతి, మనుగడ, స్థితిగతులపై దృష్టి సారిస్తూ కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో రెండో ప్రపంచ తెలుగు మహాసభలను ఈ నెల 13, 14, 15 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నారు. దేశ, విదేశాల్లోని సాహిత్య, భాష, పరిశోధన, సాంకేతిక నిపుణులకు ఈ సభలు సగర్వంగా స్వాగతం పలుకుతున్నాయి. తెలుగు వెలుగులను కనులకు కడుతూ మూణ్నాళ్లు జరిగే ఈ తెలుగు పండుగకు వేటూరి సుందరామమూర్తి ప్రాంగణం (తుమ్మలపల్లివారి కళాక్షేత్రం) వేదికైంది.

Sunday, February 13, 2011

పత్రికలు / చానల్స్

తెలుగు వార్తాపత్రికలు

తెలుగులో వార్తల సైట్లు
తెలుగులో సినిమా సైట్లు

నిశ్శబ్దం అందంగా చెదిరే వేళ

పెదవి అంచున పేరుకున్న నిశ్శబ్దం అందంగా చెదిరే వేళ
తీరం చేరిన ఆనందాన్ని తన తరగల
తరంగిణీ నృత్యంతో మాత్రమే చూసి
తరంగం మాయమౌతుందెందుకని?

కనురెప్ప పరదాల చాటు నుంచి వచ్చే సందేశం
మనసు చేరే లోపలే సందేహమవుతుందెందుకది?

నా కలలకి కథావస్తువా! నీ కెలా చెప్పను?
నీ ముంగురుల కదలికలో నాకు ప్రపంచం కనబడుతుందని
నీ కనురెప్పల చప్పుళ్ళలో నాకు వేదం వినబడుతుందని!

- యండమూరి ‘ఆనందో బ్రహ్మ’ నుంచీ

Sunday, January 30, 2011

రాష్ట్ర విద్యార్థులకు రేడియో ట్రాకర్లు : అమెరికా అమానుషం

ఇతర దేశాల్లో మానవ హక్కుల గురించి పదే పదే మాట్లాడే అమెరికా తన వరకు వచ్చేసరికి అవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ యథేచ్ఛగా వాటిని ఉల్లంఘిస్తోంది. మానవ హక్కుల హననంపై ఇతర దేశాలకు సుద్దులు చెప్పడం రివాజుగా పెట్టుకున్న అమెరికా, దోషులుగా తేలని విద్యార్థులను నేరస్తుల కంటే హీనంగా చూస్తోంది. వీసాల దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రై-వ్యాలీ యూనివర్శిటికి చెందిన మన రాష్ట్ర విద్యార్థుల పట్ల అమెరికా అధికారులు అమానుషంగా

Tuesday, January 25, 2011

మన తెలుగు ‘పద్మా’లు


 దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావును ఈసారి పద్మవిభూషణ్ పురస్కారం వరించగా, క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. 2010 సంవత్సరానికిగాను ‘పద్మ’ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ‘పద్మ’పురస్కారాలకు 128మంది ఎంపిక కాగా, వారిలో  31మంది మహిళలున్నారు.