ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ‘ఏకవాక్య తీర్మానం’ పేరుతో కేంద్రం నుండి దిగుమతి కావడం లేదా వారికిష్టమైనవారిని రుద్దడం అనేది కాంగ్రెస్ సంస్కృతి అనేది జగమెరిగిన సత్యం. ఈమధ్యనే మహారాష్ట్రలో కేంద్రమంత్రిగా వున్న ఫృథ్విరాజ్ చవాన్ ను దిగుమతి చేయడం తెలిసిందే. నేడు ఆంధ్రపదేశ్లోనూ అదే తరహా వ్యూహం అయితే జరిగింది. చివరి నిమిషంలో జైపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు కానీ లేకపోతే ఇక్కడ కూడా అదే తరహా దిగుమతి జరిగేది. మరోరకమైన విధానం ఏమంటే- ఎమ్మెల్యేల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ‘ఏకవాక్య తీర్మానం’పేరుతో కాసేపు రాజకీయ డ్రామా నడిపి, ముందుగానే నిర్ణయించబడిన వ్యక్తి పేరు ప్రకటించడం ఆనవాయితీ. అదే ప్రస్తుతం జరిగింది. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్ళ గడువు వుంది. ఈలోపు మళ్ళీ ఇటువంటి కథే పునరావృతకం కాకుండా వుంటే మంచిది.
కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ గందరగోళం వల్ల రాష్ట్రంలో ప్రజాసమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యప్రజానీకం తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమబాట పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించే నాయకుడు అవసరం. ఈ సమస్యలను కొత్త నాయకుడైనా పరిష్కరించే ప్రయత్నమైనా చేస్తాడేమో చూద్దాం...
....
Footer Right Content
Wednesday, November 24, 2010
Monday, November 22, 2010
Sunday, November 14, 2010
సినీ భీష్ముడు... డీవీఎస్ రాజు
తెలుగు చిత్రసీమకు భీష్మాచార్యుడుగా ప్రశంసలందుకొన్న రాజు భౌతికంగా దూరమైనా... ఆయన నిర్మించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి. డీవీఎస్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన 'మంగమ్మ శపథం', 'తిక్క శంకరయ్య', 'జీవన జ్యోతి' లాంటి చిత్రాల్ని సినీ ప్రియులు ఎప్పటికీ మరచిపోలేరు. కథను నమ్మిన నిర్మాత ఆయన. ఇటీవలి కాలంలో మారిపోయిన సినీ వ్యాపారాన్ని గమనిస్తూ... నిర్మాణానికి దూరంగానే ఉండిపోయారు. కేవలం తన
చిత్రాల నిర్మాణానికే డీవీఎస్ రాజు పరిమితం కాలేదు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
చిత్రాల నిర్మాణానికే డీవీఎస్ రాజు పరిమితం కాలేదు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
Thursday, November 11, 2010
Wednesday, November 10, 2010
తెలుగు సాహిత్య అభిమాని సిపి బ్రౌన్
నేడు బ్రౌన్ 212వ జయంతి
సిపి బ్రౌన్ స్వతహాగా ఆంగ్లేయుడు అయినప్పటకీ తెలుగుభాషపై మక్కువతో తెలుగు ఉద్దరణకు పూనుకున్నారు. 1786 జూన్ 13న తెల్లదొరల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయానికి ఉద్యోగరీత్యా వారి తల్లిదండ్రులు మనదేశానికి వచ్చారు. రెవరెండ్ డేవిడ్ బ్రౌన్, కాలే దంపతులకు రెండో కుమారుడు సిపి బ్రౌన్. బ్రౌన్ 1798, నవంబరు 10న కోల్‌కత్తా నగరంలో జన్మించారు. సిపి బ్రౌన్ పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్‌బ్రౌన్. 1812వ సంవత్సరంలో డేవిడ్ బ్రౌన్ మృతి చెందడంతో సిపిబ్రౌన్ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో ఉంటూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817వ సంవత్సరం తన 22వ యేట సిపిబ్రౌన్ చెన్నై నగరంలో అడుగు పెట్టారు. వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద బ్రౌన్ తెలుగు

Thursday, November 4, 2010
Subscribe to:
Posts (Atom)