....
Footer Right Content
Friday, December 31, 2010
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...
గడిచిపోతున్న ఏడాదికి వీడ్కోలు పలుకుతూ వచ్చే నూతన సంవత్సరానికి స్వాగతాలు చెబుతూ డిసెంబరు 31న వేడుకలు చేసుకోవడం పరిపాటి. నేటి సంబరాలకు ప్రపంచవ్యాప్తంగా సిద్ధమౌతున్నారు. వారం ముందునుంచే వేడుకలకు ప్రణాళిక వేసుకునేవారూ ఉన్నారు. ఏడాది చివరి రోజు స్మృతిగా మిగిలిపోవాలని అనుకుంటారు. ఆ
Saturday, December 18, 2010
ఫ్రీ సాఫ్ట్‌వేర్ వినియోగం పెరగాలి : ఎన్‌సిఎఆర్ 2010 పిలుపు
సామాన్యుల చెంతకు టెక్నాలజీ తీసుకెళ్లడానికి మహోద్యమం చేయాలని జాతీయ అకడమిక్, రీసెర్చ్ సదస్సు(ఎన్‌సిఎఆర్) పిలుపునిచ్చింది. బోధనా, పరిశోధనల్లో ఫ్రీసాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, సమాజ ఉపయోగ పరిశోధనల కోసం విద్యావేత్తలు, పరిశోధకుల మధ్య సంబంధాలు మరింత పెరగాలని సదస్సు సూచించింది. మూడు రోజులపాటు ఇక్కడ జరిగిన జాతీయ సదస్సు ఈ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ పిలుపునిచ్చింది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 550 మంది విద్యావేత్తలు, పరిశోధకులు హాజరయ్యారు. విద్య,
Thursday, December 9, 2010
చేతికందాల్సిన పంటలు చేజారిపోయాయి
చేతికందాల్సిన పంటలు చేజారిపోయాయి. సార్వాలో నాలుగుసార్లు ఏర్పడిన అల్పపీడనాలు పంట పొలాలను తుడిచి పెట్టేశాయి. లైలా తుపాను పరిహారమే ఇంతవరకూ రాలేదు. పలు జిల్లాలో నష్టం కోట్లలో ఉంటుందని అంచనా. అయితే అధికారిక అంచనాలు అందులో నాలుగో వంతు కూడా లేదు. వేలాది ఎకరాల్లో వరి పైర్లు దెబ్బతిన్నాయి. నాట్ల దశలోనే నాశనమైంది. కొంత పొట్టమీదున్న పైరూ నీటమునిగింది. చెరువులకింద వరి సాగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓదెలు నీటమునిగాయి.
మీడియా ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాఫ్ట్వేర్ తోడ్పాటు
Wednesday, November 24, 2010
‘ఏకవాక్య తీర్మానం’ పేరుతో కేంద్రం నుండి దిగుమతి
ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ‘ఏకవాక్య తీర్మానం’ పేరుతో కేంద్రం నుండి దిగుమతి కావడం లేదా వారికిష్టమైనవారిని రుద్దడం అనేది కాంగ్రెస్ సంస్కృతి అనేది జగమెరిగిన సత్యం. ఈమధ్యనే మహారాష్ట్రలో కేంద్రమంత్రిగా వున్న ఫృథ్విరాజ్ చవాన్ ను దిగుమతి చేయడం తెలిసిందే. నేడు ఆంధ్రపదేశ్లోనూ అదే తరహా వ్యూహం అయితే జరిగింది. చివరి నిమిషంలో జైపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు కానీ లేకపోతే ఇక్కడ కూడా అదే తరహా దిగుమతి జరిగేది. మరోరకమైన విధానం ఏమంటే- ఎమ్మెల్యేల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ‘ఏకవాక్య తీర్మానం’పేరుతో కాసేపు రాజకీయ డ్రామా నడిపి, ముందుగానే నిర్ణయించబడిన వ్యక్తి పేరు ప్రకటించడం ఆనవాయితీ. అదే ప్రస్తుతం జరిగింది. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్ళ గడువు వుంది. ఈలోపు మళ్ళీ ఇటువంటి కథే పునరావృతకం కాకుండా వుంటే మంచిది.
కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ గందరగోళం వల్ల రాష్ట్రంలో ప్రజాసమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యప్రజానీకం తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమబాట పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించే నాయకుడు అవసరం. ఈ సమస్యలను కొత్త నాయకుడైనా పరిష్కరించే ప్రయత్నమైనా చేస్తాడేమో చూద్దాం...
కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ గందరగోళం వల్ల రాష్ట్రంలో ప్రజాసమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యప్రజానీకం తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమబాట పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించే నాయకుడు అవసరం. ఈ సమస్యలను కొత్త నాయకుడైనా పరిష్కరించే ప్రయత్నమైనా చేస్తాడేమో చూద్దాం...
Monday, November 22, 2010
Subscribe to:
Posts (Atom)
