....

Footer Right Content

Thursday, September 30, 2010

మూఢ విశ్వాసాల నీడనే గిరిజనం

ఆధునిక యుగంలోనూ గిరిజనులు మూఢ విశ్వాసాల నీడనే బతుకుతున్నారు. వారిలో చైతన్యం నింపాల్సిన అధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారు. పాముకాటుకు మంత్రం, తేలు కుడితే నాటు వైద్యం జ్వరం వస్తే తాయత్తు వంటివి గ్రామాల్లో నేటికీ చెలామణీలో వున్నాయి.  దీని ఆధారంగా నాటు వైద్యులలు బతికేస్తున్నారు. మూఢ నమ్మకాల ముసుగులో పడి అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతినిత్యం గిరిజన ప్రాంతాల్లోనేకాక మారుమూల పల్లెల్లో కూడా చోటు చేసుకుంటూనేవున్నాయి. అధికారులు వారిలో చైతన్యం నింపడానికి చేస్తున్న ప్రయత్నాలు, ప్రభుత్వ పథకాలు శూన్యం. ఎన్ని స్వాతంత్య్రదినోత్సవాలు జరుపుకున్నా.... వీరి బ్రతుకులు మారవు. అంతేకాకుండా  గిరిజన తండాల్లో ఆడపిల్లల విక్రయాలు, భౄణహత్యలు, చేతబడులు, నాటువైద్యం, మంత్ర తంత్రాలు నిత్యం చోటుచేసు కుంటూనే వున్నాయి. దీనికి ప్రధాన కారణం- పేదరికం, నిరక్షరాస్యత.  గిరిజనుల్లో చైతన్యం లేకపోవడం వల్ల వారు ఆడ పిల్లలను విక్రయించడం, లేదా  పురిటిలోనే పీకపిసికి చంపేస్తున్న సంఘటనలు అనేకం జరుగుతూనే వున్నాయి.
గిరిజన తండాల్లో అభివృద్ధికి ఆమడదూరంలో జీవితాలను వెల్లబుచ్చుతున్న వీరిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వీరి అభివృద్ధికోసం నిస్వార్థంగా కృషిచేయాలి. అప్పుడే వీరి జీవితాలలో వెలుగులు నిండుతాయి.

Monday, September 27, 2010

ఇబుక్ కి మామూలు పుస్తకానికి తేడా ఏమిటి?

మిత్రులారా,
ఇపుస్తకానికి (eBook), మామూలు పుస్తకానికి తేడా ఏమిటి?
ఇబుక్ చదివినదానికి, మామూలు పుస్తకం చదివినదానికి తేడా ఏమిటి?
ఎలాంటి అనుభూతి కలుగుతుంది?
ప్రస్తుతం లేటెస్ట్ ఇబుక్స్ వివరాలను బ్లాగర్ మిత్రులు తెలపవలసిందిగా  కోరుతున్నాను.

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యవరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టును నాటి పర్యవరణం పరిరక్షణ కోసం పాటు పడాలి.  మన  పరిసరాలను మనమే కాపాడుకోవాలి.  రోజురోజుకు వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దానిలో బాగంగా గ్రేన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ లాంటివి పడకుండా, ఓజోన్‌ పొర దెబ్బతిన కుండా ఉండాలంటే ఇలాంటి కార్య క్రమాలు చేపట్టాలి. ప్రతి జీవికి ప్రాణవాయువు ఆక్సిజన్‌ ఎంతో ముఖ్యం. దాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.  ప్రతి ఇంటి ముందూ చెట్లు నాటి పర్యవరణ పరిరక్షణకు దోహదం చేయాలి.

Tuesday, September 21, 2010

యుగపురుషుడు మన గురజాడ

నేడు గురజాడ అప్పారావు 148వ జయంతి

అంధయుగం మీద ఉషస్సులా జ్వలించే శక్తిని అక్షరంలో నిక్షిప్తం చేసిన యుగపురుషుడాయన.
సామాజిక వికృతిని ప్రతిబింబించే అద్దంలా మారే విద్యను అక్షరానికి నేర్పినవాడాయన.
ఆయనే గురజాడ వేంకట అప్పారావు గారు. మధురవాణి అనే వేశ్యారత్నం ఈ క ళింగ దేశంలో పుట్టకపోతే ఎంత లోపం జరిగేదో కదా! అంటాడు ‘కన్యాశుల్కం’ నాటకంలో కరటకశాస్ర్తి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ గురజాడ అనే మహా రచయిత తెలుగునాట పుట్టకపోతే ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్ప శూన్యం ఆవహించేది.

Thursday, September 16, 2010

దీనికి బాధ్యులెవరు...?

రాష్ట్రంలో ఎలాంటి ఆందోళన జరిగినా ముఖ్యంగా ఆ ప్రభావం బస్సులపై  పడుతోంది. కనిపించిన బస్సులపై వారు ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం ప్రజలపైనే భారాలు మోపుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు...  రాష్ట్రంలో ఏ ఆందోళన, బంద్ జరిగినా అందరి ప్రతాపం బస్సులపైనే.  గతంలో ఆర్టీసీ అధికారులు 'నేనేం పాపం చేశాను' అంటూ బస్సు ప్రశ్నిస్తున్నట్లుగా మంటల్లో దగ్ధమైన బస్సులను ప్రదర్శనకు పెట్టినప్పటికీ

Wednesday, September 15, 2010

అద‏రగొట్టిన 'మగధీర'


జాతీయస్థాయిలో వెండితెర అవార్డుల జాబితా వెలువడింది. సినీ అవార్డుల పండుగలో కేరళ తారలు మరోమారు వెలిగాయి. వైవిధ్యం బాటలో నడుస్తూ ప్రేక్షకుల గుండెను తాకుతున్న బాలీవుడ్ అత్యధిక అవార్డులు అందుకుని విజయ పతాక ఎగురవేసింది.  మలయాళం, హిందీ చిత్రాలు పోటాపోటీగా అవార్డులు సాధించాయి.  తెలుగు సినిమాకూ రెండు అవార్డులు లభించాయి.

79 ఏళ్ల తెలుగు సినిమా

మనిషిని అత్యంత ప్రభావితం చేసిన అంశాల్లో సినిమా ఒకటి.  భాషా, ప్రాంతం... అనే ఎల్లలు లేనిది సినిమా. అసలు ఈ సినిమా  పదం 'కినిమా' అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. 'పురోగమనంలో ముందుకు పోవడం' అనేది దీని అర్థం. నాడు కదిలిన బొమ్మ, నేడు ఆధునికపు హంగులతో వేగంగా పరుగెడుతోంది. ఎన్నో వింతలు, విశేషాలు, విప్లవాలు మానవ సమాజంలో చోటుచేసుకోవడానికి కారణమైన ఈ కదిలేబొమ్మ తెలుగువారికి పరిచయమై నేటికి 79 సంవత్సరాలు.

ఈ సందర్భంగా సినిమా గురించి...1913లో తొలిభారతీయ చిత్రం 'రాజా హరిశ్చంద్ర'ను దాదాసాహెబ్‌ ఫాల్కే తీశారు. ఇది మూకీ చిత్రం. అంటే తెరపై బొమ్మలు మాత్రమే కదులుతాయి. నటుల హావభావాలతోనే సినిమా కథను